Deepti Sunaina : ఆమేం సినిమా స్టార్ కాదు. పెద్దగా బ్యాగ్రౌండ్ లేదు. పేరు మోసిన మోడల్ కాదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్.. ఆమె ఒక ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే వేలల్లో కామెంట్స్ వస్తాయి. లక్షల్లో లైక్స్ వెళ్తాయి. షార్ట్ ఫిలిమ్స్ లో, వీడియో సాంగ్స్ తోనే ఈ రేంజ్ పాపులారిటీ అంటే.. ఇక సినిమాలోకి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంతకీ ఆమె ఎవరనే కదా మీ సందేహం.. అయితే చదవండి ఈ కథనం
సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి దీప్తి సునైనా అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్ గా, షార్ట్ ఫిలిమ్స్, వీడియో సాంగ్స్ తో ఆమె నెటిజన్లకు సుపరిచితురాలే.. 26 ఏళ్ల ఈ హైదరాబాద్ చిన్నది.. తన అందమైన ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా అధునాతన దుస్తులు ధరించి ఫోటోషూట్ నిర్వహించింది దీప్తి. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇంకేముంది దెబ్బకు ఆ ఫోటోలు సర్కు లేట్ అవ్వడం మొదలుపెట్టాయి. వీటిని చూసిన యువకులు.. అబ్బా ఇదేం అందం రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దీప్తి స్వస్థలం హైదరాబాద్. ఈమె హైదరాబాదులో స్టెవెన్స్ అన్నా కాలేజీలో డిగ్రీ చేసింది. డిగ్రీ చదువుకుంటూనే మోడలింగ్ చేసింది. సినిమాలపై ఉన్న ఇష్టంతో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.. అయినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. దీప్తి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పట్లో ఈమె ఒక నటుడితో ప్రేమలో ఉందనే పుకార్లు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అధునాతన దుస్తులు ధరించి.. ఫోటోలు అప్లోడ్ చేస్తుంది. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో సందడి చేసింది. టైటిల్ గెలుస్తుందనుకునే క్రమంలో ఎలిమినేట్ అయ్యింది. ఇక ప్రస్తుతం అధునాతన దుస్తులు ధరించి దీప్తి అప్లోడ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని చూసిన కుర్రాళ్ళు లైక్ లు, కామెంట్లు చేస్తున్నారు.