December 31 Drunkards Day : డిసెంబర్ 31: ప్రపంచ తాగుబోతుల దినోత్సవం

December 31 Drunkards Day : ఇటీవల ఒక ఫేమస్ యాంకర్ కం జర్నలిస్టు.. ఏదో ఊళ్లో పర్యటించి ఓ రైతును పట్టుకొని ఒక హామీ కోరుతుంది. అందులో ఈ కొత్త సంవత్సరంలో అయినా రైతులు అయిన మీరు మందు మానేయాలని కోరుతుంది. దానికి ఆ రైతు తాపీగా ఆ యాంకర్ కు ఓ గట్టి హామీనిస్తాడు. ‘జనవరి 1వ తేదీ నుంచి నేను మందు మానేస్తున్నాను… కానీ’ అని గ్యాప్ ఇస్తాడు. అప్పటికే సాధించేశానని సంబరపడిన […]

Written By: NARESH, Updated On : December 31, 2022 6:45 pm
Follow us on

December 31 Drunkards Day : ఇటీవల ఒక ఫేమస్ యాంకర్ కం జర్నలిస్టు.. ఏదో ఊళ్లో పర్యటించి ఓ రైతును పట్టుకొని ఒక హామీ కోరుతుంది. అందులో ఈ కొత్త సంవత్సరంలో అయినా రైతులు అయిన మీరు మందు మానేయాలని కోరుతుంది. దానికి ఆ రైతు తాపీగా ఆ యాంకర్ కు ఓ గట్టి హామీనిస్తాడు. ‘జనవరి 1వ తేదీ నుంచి నేను మందు మానేస్తున్నాను… కానీ’ అని గ్యాప్ ఇస్తాడు. అప్పటికే సాధించేశానని సంబరపడిన యాంకర్ చప్పట్లు కొట్టి రైతును ప్రశంసిస్తుంది.

కానీ ఆ గ్యాప్ ను పూర్తి చేస్తూ రైతు ‘డిసెంబర్ 31 రాత్రి మాత్రం ఫుల్లుగా నాలుగు పెగ్గులు ఎక్కువ తాగి ఇక రేపటి నుంచి తాగడం మానేస్తాను అంటూ సెలవిస్తాడు. ఇది యాథార్థ జరిగిన ఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మందుబాబులను ఎంత కంట్రోల్ చేద్దామన్నా కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే వారి తీరే అంత.. మద్యం మానేస్తానని భార్యలు భర్తల వెంట పడడం.. ఆ రాత్రికి గమ్మున ఉండి తెల్లవారి మళ్లీ స్ట్రాట్ చేసిన వారు ఎందరో. సంసారాల్లో సగం కాపురాలు కూలేవి ఈ మద్యం వల్లనే.

ప్రపంచవ్యాప్తంగా మద్యం తాగని వారు చాలా తక్కువమందే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్లు కూడా బీర్, లైట్ డ్రింక్స్ అంటూ మద్యం పుచ్చుకుంటూనే ఉంటున్నారు.

తాగుబోతులంతా కూడా డిసెంబర్ 31తో ఫుల్ ఎంజాయ్ చేసి తెల్లవారి కొత్త సంవత్సరంలో ప్రధానంగా ఒక అలవాటును మానుకోవాలని తీర్మానిస్తారు. అదే ‘మద్యం మానేయడం’. జనవరి 1వ తేదీన అది పాటిస్తారు. ఎందుకంటే రాత్రి తాగింది దిగదు. హ్యాంగోవర్ లో ఉంటారు. సంక్రాంతి వరకూ పాటిస్తారు. మళ్లీ సంక్రాంతికి మొదలుపెట్టేవారు ఎందరో. అందుకే మద్యం మానేస్తానని చెప్పిన మందుబాబులను ఎవరూ నమ్మరు. నమ్మడం సాధ్యం కాదనే చెప్పాలి.

ఇక డిసెంబర్ 31 వచ్చేసింది. ప్రపంచ తాగుబోతులకు పండుగలా ఈ రోజు రాత్రి ఉంటుంది. తాగుబోతులంతా కూడా మందు విందులతో ఎంజాయ్ చేసే రోజు ఇదీ. కేకులు, బీర్లు, వైన్స్ , చికెన్, మటన్ తెచ్చుకొని రాత్రంతా తాగుతూ తులూతూ తెగ ఎంజాయ్ చేస్తారు. అందుకే ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి.. ఇతర సమితులు ఎవరూ గుర్తించినా గుర్తించకున్నా.. ప్రపంచ తాగుబోతుల దినోత్సవంగా డిసెంబర్ 31ని మందుబాబులంతా ఏకగ్రీవంగా గుర్తించారు. ఈరోజు పండుగలా జరుపుకుంటారు.