Dasara : న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.నిన్నటితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కు ని కూడా పూర్తి చేసుకొని కమర్షియల్ హిట్ గా నిల్చింది.కానీ ఈ సినిమా కొన్ని ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ చాలా కష్టమని అంటున్నారు ట్రేడ్ పండితులు.అందులో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గురించి చెప్పుకోవాలి.
రాయలసీమ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా ఆరు కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగింది.ఇప్పటి వరకు ఈ సినిమాకి ఇక్కడ కేవలం మూడు కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టాలి, కానీ అది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
పిల్లలకు పరీక్షల సీజన్ అవ్వడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో వసూళ్లు రెండవ రోజు నుండి బాగా తగ్గిపోయాయని అంటున్నారు.ఇంటర్ స్టూడెంట్స్ కి సెలవులు అయినా,పదవ తరగతి పిల్లలకు పరీక్షలు జరుగుతుండడం ఈ సినిమాకి పెద్ద శాపం లాగా మారింది.అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పిల్లల్ని తీసుకొని రావడం లేదు.అయితే ఈ వారం గుడ్ ఫ్రై డే ఉండడం, దానితో పాటుగా వీకెండ్ కూడా ఉండడం తో ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు బయ్యర్స్.
మరో పక్క ఈ సినిమా తెలంగాణ ప్రాంతం లో అద్భుతంగా ఆడుతుంది.ఇప్పటికే ఈ సినిమా అక్కడ 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధం గా ఉంది.ఈ వీకెండ్ తో 2 మిలియన్ డాలర్స్ కూడా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.