Dasara collections : రెండవ రోజు యావరేజి వసూళ్లను నమోదు చేసుకున్న’దసరా’..ఎంత రాబట్టింది అంటే!

Dasara collections : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని సుమారుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఒక మీడియం రేంజ్ హీరోకి ఈ స్థాయి వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు, చాలా మంది విశ్లేషకులు ఈ వసూళ్లను చూసి నాని ఇక మీదట మీడియం రేంజ్ హీరో కాదు, ఆయన […]

Written By: NARESH, Updated On : March 31, 2023 7:39 pm
Follow us on

Dasara collections : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని సుమారుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఒక మీడియం రేంజ్ హీరోకి ఈ స్థాయి వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు, చాలా మంది విశ్లేషకులు ఈ వసూళ్లను చూసి నాని ఇక మీదట మీడియం రేంజ్ హీరో కాదు, ఆయన రేంజ్ మారిపోయింది, ఇక నుండి ఆయన స్టార్ హీరో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల రూపాయలకు జరిగింది.మొదటి రోజు ఏకంగా 20 కోట్లు రాబట్టింది.నాని గత చిత్రం ‘అంటే సుందరానికి’ సుమారుగా 20 కోట్ల రూపాయిల షేర్ ని క్లోసింగ్ లో రాబట్టింది,అలాంటిది ‘దసరా’ చిత్రం మొదటి రోజే ఆ రేంజ్ వసూళ్లు రాబట్టేసరికి ఈ సినిమాని కొన్న బయ్యర్స్ సంబరాలు చేసుకున్నారు.

అయితే మొదటి రోజు ఉన్నంత ఊపు రెండవ రోజు మాత్రం లేదనే చెప్పాలి.నైజాం ప్రాంతం లో సూపర్ స్ట్రాంగ్ వసూళ్లను రాబడుతున్నప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం యావరేజి వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ముఖ్యంగా ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాలలో ఈ సినిమాకి బీ, సి సెంటర్స్ లో బీలో యావరేజి వసూళ్లు వచ్చాయట.

పండగ తర్వాత వర్కింగ్ డే రావడం వల్లే కలెక్షన్స్ మీద ఈ ప్రాంతాలలో ప్రభావం పడిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక నెల్లూరు మరియు సీమ ప్రాంతం లో కూడా పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు వచ్చాయి.కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం లో మాత్రం మార్నింగ్ ఆట నుండే హౌస్ ఫుల్ బోర్డ్స్ తో థియేటర్స్ కళకళలాడిపోయాయి.మొత్తం మీద రెండవ రోజు ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతం లో 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.