
Dasara Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం ‘దసరా’ అద్భుతమైన వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి నాలుగు రోజుల్లోనే 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి చరిత్ర తిరగరాసింది.మీడియం రేంజ్ హీరోలందరీ క్లోసింగ్ కలెక్షన్స్ ని కేవలం వారం లోపే దాటేశాడు నాని.
ఈ చిత్రానికి వచ్చిన వసూళ్ళలో ఎక్కువ శాతం తెలంగాణ మరియు ఓవర్సీస్ ప్రాంతం నుండే అవ్వడం విశేషం. ఆంధ్ర ప్రదేశ్ లో రెండవ రోజు నుండి ఆశించిన స్థాయి వసూళ్లు లేవు. ఇక మొదటి వర్కింగ్ డే అయినా సోమవారం నాడు ఈ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతీ చోట దారుణమైన డ్రాప్స్ పడ్డాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 5 వ రోజు కేవలం కోటి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
మొదటి వీకెండ్ లో వచ్చిన వసూళ్లతో ట్రెండ్ తో పోలిస్తే 5 వ రోజు వచ్చిన వసూళ్లు చాలా తక్కువ అనే చెప్పొచ్చు. రాయలసీమ వంటి ప్రాంతం లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతం మినహా, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అన్నీ ప్రాంతాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టడం కష్టమే అని అంటున్నారు. కానీ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ మాత్రం నిన్ననే దాటేసింది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. నిన్నటితో ఈ సినిమా 51 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. బయ్యర్స్ అందరూ ఈ వీకెండ్ మీదనే భారీ అంచానాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ వీకెండ్ గుడ్ ఫ్రైడే ఉంది, దాంతో పాటుగా వీకెండ్ కూడా కలిసి వస్తుందని బయ్యర్స్ ఆశలు పడుతున్నారు.మరి వాళ్ళ ఆశలను ఈ సినిమా నిలబెడుతుందో లేదో చూడాలి.