
Dasara 2 Weeks Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం ఇటీవలే విడుదలై నాని కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై అంచనాలు భారీ గా ఉండేవి. ఎందుకంటే నాని మొట్టమొదటిసారి ఊర మాస్ లుక్ లో కనిపించడం, దానికి తోడు టీజర్ మరియు ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండడం, కచ్చితంగా ఎదో గొప్ప సినిమా తీసాడు అనే అనుభూతి విడుదలకు ముందు నుండే కలగడం, ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ తెప్పించడం లో ఉపయోగపడ్డాయి.
కేవలం ఓపెనింగ్స్ లో మాత్రమే కాదు, లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా దంచి కొట్టేసింది.ఆంధ్ర ప్రదేశ్ లో అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాకపోయినా తెలంగాణ మరియు ఓవర్సీస్ లో ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలై రెండు వారాలు అయ్యింది. ఈ రెండు వారాలకు గాను ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతం లో పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.టాప్ 6 స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కొంతమంది కెరీర్ హైయెస్ట్ కూడా ఇంత ఉండదని అంటున్నారు.ఇప్పటికీ ఈ సినిమా రన్ ఇంకా ఆగిపోలేదు,మరో రెండు వారాల వరకు షేర్ వసూళ్లు వచ్చే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది.తెలంగాణలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లనే రాబట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ సీడెడ్ తో కలిసి ఈ చిత్రం రెండు వారాలకు గాను కేవలం 18 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.ఇక ఓవర్సీస్ లో 10.42 కోట్లు, కర్ణాటక లో 4.62 కోట్లు , హిందీ మరియు ఇతర భాషలకు కలిపి మూడు కోట్లు వసూలు చేసిందట.మొత్తం మీద రెండు వారాలకు కలిపి సుమారుగా 62 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు.