
Das Ka Dhamki First Review: ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో అన్ని క్రాఫ్ట్స్ మీద బలమైన పట్టు ఉన్న నటుడు ఎవరంటే విశ్వక్ సేన్ అనే చెప్పాలి. ఇతనికి సినిమా మీద ఉన్న పిచ్చి ఇష్టం చూస్తూ ఉంటే రాబొయ్యే రోజుల్లో స్టార్ హీరో లీగ్ లోకి అడుగుపెట్టేస్తాడని అందరికీ అర్థం అయిపోతుంది. మొదటి సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ‘ఫలక్ నూమా దాస్’, ‘హిట్’ , ‘ఆకాశం లో అర్జున కళ్యాణం’ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.
ఇది ఇలా ఉండగా మంచి నటుడిగా మాత్రమే కాదు, ఒక మంచి దర్శకుడిగా కూడా విశ్వక్ సేన్ ‘ఫలక్ నూమా దాస్’ చిత్రం తో నిరూపించుకున్నాడు, ఇప్పుడు లేటెస్ట్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో మరోసారి ఆయన డైరెక్టర్ గా మారిపోయాడు. ఈసారి కేవలం డైరెక్టర్ హీరో గా మాత్రమే కాదు, ఈ చిత్రం తో నిర్మాతగా కూడా మారిపోయాడు విశ్వక్ సేన్.

ఈ చిత్రం కోసం ఆయన ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసాడట. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యాడు. ఆయన హాజరు అవ్వడం వల్ల మూవీ పై మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు UA సర్టిఫికెట్ ని అందజేశారు.

విశ్వక్ సేన్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ఉందని, కమర్షియల్ ప్రేక్షకులు ఏవైతే కోరుకుంటారో అవన్నీ చాలా చక్కగా, వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. సాంగ్స్ కూడా అదిరిపోయాయి అట, రొటీన్ కథ అయ్యినప్పటికీ కూడా విశ్వక్ సేన్ టేకింగ్ చాలా కొత్తగా ఉందట, మరి సెన్సార్ టాక్ కి తగ్గట్టుగా సినిమా ఉందొ లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.