Crocodile Attack: సామాజిక మాధ్యమాల నేపథ్యంలో ప్రతిది యూట్యూబ్ లో పోస్టు చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ఎక్కువ మది లైక్ చేస్తుండటంతో వాటికి ప్రాచుర్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువతి మొసలితో పోరాడే సన్నివేశం ప్రస్తుతం నెట్లో ప్రచారం ఎక్కువగా పొందుతోంది. ఆమె మొసలితో చేసే ప్రయత్నం అందరిని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. దీంతోనే నెటిజన్లు ఆ వీడియోను ఎక్కువగా చూస్తున్నారు.

యూఎస్ లో హ్యాండర్ లిండ్సేబుల్ అనే యువతి మొసళ్లకు ఆహారం వేసే పని చేస్తోంది. ఆమె పదకొండేళ్ల డార్ట్ వాటర్ అనే మొసలికి మాంసం వేసేందుకు వెళ్లడంతో అక్కడ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొందరికి గమ్మత్తుగా అనిపిస్తే మరికొందరికి భయంగా కనిపించింది. దీంతో అందరు ఆ వీడియోను పదేపదే చూస్తున్నారు.
Also Read: AP Ration Rice: రేషన్ బియ్యం వద్దా..అయితే నగదు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్
జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి కారణమైందని తెలుస్తోంది. గతంలో మొసలి, కొండచిలువ ఫైట్ కూడా ఇలాగే వైరల్ కావడం తెలిసిందే. ఇప్పుడు ఈ యువతి మొసలి వీడియో నెట్టింట్లో తెగ ప్రచారం సాగుతోంది. జంతువులకు సంబంధించిన వీడియోలను ఆసక్తిగా తిలకిస్తారు.

మొసళ్లకు హ్యాండ్లర్ గా పనిచేసే యువతి ఆ రోజు మొసలికి మాంసం వేయడానికి వెళ్లింది. ఆ మొసలి యువతి చేయి పట్టుకుని నీటిలోకి బలంగా లాగింది. దీంతో ఆమె నీటిలో పడిపోయింది. మొసలి చేయి విడవలేదు. దీంతో ఆమె కేకలు వేసింది. అక్కడే ఉన్న వారు నీటిలో దిగి మొసలిని గట్టిగా పట్టుకుని తీవ్రంగా ప్రయత్నించి ఆమె చేయిని మొసలి నుంచి వేరు చేయగలిగారు. ఆమె చేతికి గాయాలయ్యాయి. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
Also Read:KCR Ambedkar: కేసీఆర్.. అంబేద్కర్.. ఎందుకంత దూరం?
— Nature Is Metal (@Naturelsmetall) April 8, 2022