
Janhvi Kapoor: శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె సౌత్ ఇండియా అరంగేట్రం కన్ఫర్మ్ అయ్యింది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నారు. దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30వ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హీరోయిన్ గా ఎంపికైన జాన్వీ ఈ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దర్శకుడు రాజమౌళి జాన్వీ కపూర్ తో కొన్ని నిమిషాలు మాట్లాడారు. ఆమె ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
ఇక జాన్వీ కపూర్ కెరీర్లో ఇది అతిపెద్ద ఆఫర్. ఏకంగా ఆర్ ఆర్ ఆర్ హీరో పక్కన ఆమె ఛాన్స్ కొట్టేశారు. జాన్వీ వెండితెరకు పరిచయమై ఐదేళ్లు అవుతుంది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. కారణం తెలియదు కానీ ఇంతవరకు ఒక్క బాలీవుడ్ స్టార్ హీరో కూడా జాన్వీ కపూర్ కి ఆఫర్ ఇవ్వలేదు. ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.

బాలీవుడ్ ని తలదన్నేలా ఎదిగిన టాలీవుడ్ లో ఆమె అతిపెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకుంది. కేవలం శ్రీదేవి కూతురన్న కారణంగా జాన్వీకి ఈ ఆఫర్ దక్కింది. ఎన్టీఆర్ తాతగారు సీనియర్ ఎన్టీఆర్, జాన్వీ తల్లి శ్రీదేవి కలిసి అద్భుతమైన కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. వారి పెయిర్ కి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. వారి వారసులు ఎన్టీఆర్-జాన్వీ నటించడం అరుదైన విషయం. దీన్ని క్రేజీ కాంబినేషన్ గా ఆడియన్స్ చూస్తారు. ఎన్టీఆర్ 30 నుండి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశారు. ఆమె లుక్ ఆకట్టుకుంది.

ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఫస్ట్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు సమాచారం. 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 విడుదల కానుంది. మరోవైపు జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ వేదికగా కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నారు. బీచ్ లో బికినీ వేసి చెమటలు పట్టించింది జాన్వీ. ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫిక్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా జనాలు పండగ చేసుకుంటున్నారు.