
Janhvi Kapoor: శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ సినిమాల కంటే హాట్ ఫోటో షూట్స్ తో ఫేమస్ అయ్యారు. ఈ యంగ్ లేడీ ఇంస్టాగ్రామ్ లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. గ్లామర్ ప్రియులు జాన్వీ కపూర్ ని ఆరాధిస్తూ ఉంటారు. అందాల ప్రదర్శనలో జాన్వీ అసలు మొహమాటపడరు. జాన్వీ అందాలకు అలవాటు పడ్డ జనాలు ఆమెను పిచ్చిగా ఆరాధిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో జాన్వీని 21 మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేని జాన్వీ కి ఈ రేంజ్ ఫాలోయింగ్ కేవలం ఫోటో షూట్స్ కారణంగానే.
తాజా ఫోటో షూట్ లో జాన్వీ మరోసారి మంట పుట్టించారు. గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ ధరించి టాప్ టు బాటన్ పరువాల విందు చేసింది. సదరు డ్రెస్ కట్ దారుణంగా ఉంది. జాన్వీ డ్రెస్ చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బికినీని పోలిన డ్రెస్ ధరించిందంటూ వాపోతున్నారు. జాన్వీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.

ఇక జాన్వీ భారీ ఆఫర్ పట్టేసిన విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ నటిస్తున్నారు. ఎన్టీఆర్ 30 హీరోయిన్ గా ఆమె ఎంపికయ్యారు. మార్చి నెలలలో షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో ఎన్టీఆర్ మీద యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారట. గోవా షెడ్యూల్ లో జాన్వీ సైతం పాల్గొననున్నారట.

ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ రోల్ చాలా కీలకమని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. దీంతో జాన్వీ పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి వారసులైన ఎన్టీఆర్, జాన్వీ జతకడుతున్న ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ అట్రాక్షన్ ఏర్పడింది. 2024 సమ్మర్ కానుకగా ఎన్టీఆర్ 30 విడుదల కానుంది. ఎన్టీఆర్ 30తో జాన్వీ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటుందేమో చూడాలి. 2018లో ధడక్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది జాన్వీ. కూతురిని హీరోయిన్ గా వెండితెర మీద చూసుకోవాలనే కల నెరవేరకుండానే శ్రీదేవి కన్నుమూశారు.