Divi Vadthya: ఏ “దివి” లో విరిసిన పారిజాతమో..

Divi Vadthya: సినిమా ఇండస్ట్రీలో అందానికే ప్రాధాన్యం ఎక్కువ. అలాగని అందంగా ఉన్న వారందరూ అవకాశాలు దిక్కించుకోలేరు. కొందరికే ఆ అదృష్టం ఉంటుంది. అలాంటి అదృష్టవంతుల జాబితాకు చెందుతుంది దివి వడిత్యా. బుల్లితెరపై మెరిసిన ఈ సొట్ట బుగ్గల సుందరి.. వెండి తెరపై తెగ సందడి చేస్తోంది.. వరుస సినిమా అవకాశాలు, వెబ్ సీరీస్ లతో క్షణం తీరిక లేకుండా ఉంటోంది. ఏమాత్రం వీలు చిక్కినా తన ఫోటో షూట్ లో పాల్గొంటున్నది. సామాజిక మాధ్యమాలను షేక్ […]

Written By: K.R, Updated On : April 20, 2023 10:27 am
Follow us on

Divi Vadthya

Divi Vadthya: సినిమా ఇండస్ట్రీలో అందానికే ప్రాధాన్యం ఎక్కువ. అలాగని అందంగా ఉన్న వారందరూ అవకాశాలు దిక్కించుకోలేరు. కొందరికే ఆ అదృష్టం ఉంటుంది. అలాంటి అదృష్టవంతుల జాబితాకు చెందుతుంది దివి వడిత్యా. బుల్లితెరపై మెరిసిన ఈ సొట్ట బుగ్గల సుందరి.. వెండి తెరపై తెగ సందడి చేస్తోంది.. వరుస సినిమా అవకాశాలు, వెబ్ సీరీస్ లతో క్షణం తీరిక లేకుండా ఉంటోంది. ఏమాత్రం వీలు చిక్కినా తన ఫోటో షూట్ లో పాల్గొంటున్నది. సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ తో సత్తా చాటుతోంది.

దివి అమ్మ, అన్నయ్య ఇద్దరూ డాక్టర్లే. దివి మాత్రం అటువైపు వెళ్ళకుండా ఎంటెక్ చేసింది. తర్వాత మోడలింగ్ వైపు వెళ్ళింది. మోడలింగ్ చేసుకుంటూనే ప్యాకెట్ మనీ సంపాదించడం మొదలుపెట్టింది. ఎత్తు, అందం, సూపర్ ఫిజిక్ ఉండటంతో సినిమా రంగంలోకి ప్రవేశించింది.. వాస్తవానికి దివికి చిన్నప్పటినుంచి సినిమా అంటే ఫ్యాషన్. అందుకే నటనకు ఆస్కారం ఉన్న ఏ చిన్న సన్నివేశాన్ని కూడా వదిలి పెట్టేది కాదు.. అందుకే మహర్షి సినిమాలో మహేష్ బాబుతో ఒక చిన్న సన్నివేశంలో నటించింది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కవర్ సాంగ్స్ చేసింది.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక కవర్ సాంగ్ కూడా చేసింది.. అయినప్పటికీ దివికి అనుకున్నంత గుర్తింపు రాలేదు.

అయితే బిగ్ బాస్ _4 సీజన్ లో అవకాశం రావడంతో దివి దశ మారిపోయింది.. ఈ గేమ్ లో తనదైన ఆట తీరుతో అందరినీ అలరించింది..ముక్కుసూటి తనానికి చాలా మంది ఫిదా అయ్యారు. దివి మాటలకు ముగ్దుడైన మెగాస్టార్ చిరంజీవి ఆమెకు తన సినిమాలో అవకాశం ఇస్తానని ప్రకటించాడు..అన్నట్టుగానే తన గాడ్ ఫాదర్ సినిమాలో ఆకాశం ఇచ్చాడు.. అలా ఆ సినిమాలో దివి తన నటనతో మెప్పించింది. వరుస ఆఫర్లు అందుకుంటుంది.. ఏకంగా లంబసింగి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ” మా నీళ్ల ట్యాంక్”, ఏటీఎం సిరీస్ లతో అలరిస్తోంది.

Divi Vadthya

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు…తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. కుర్ర కారుకు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తూ ఉంటుంది.. చూపు తిప్పుకోనివ్వని అందంతో యువకులను మాయ చేస్తుంది..తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని షేర్ చేసిన ఫోటోలో ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన యువకులు ఏ “దివి” లో పూసిన పారిజాతమో నువ్వు అంటూ దివిని కీర్తిస్తూ కామెంట్లు చేస్తున్నారు.