Deepika Pilli: వయసొచ్చిందో లేదో పరువాలు వడ్డించేస్తుంది… కుర్రాళ్లకు కిక్ ఇచ్చేలా దీపికా పిల్లి పరువాలు!

Deepika Pilli: పాతికేళ్ల ప్రాయంలో పరువాల జడివానలో దీపికా పిల్లి తడిపేస్తోంది. ఆమె గ్లామర్ పవర్ కుర్రాళ్లకు షాక్ ఇస్తుంది. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మండే ఎండల్లో చల్లని సాగరతీరంలో దీపికా సేద తీరింది. కురచ బట్టల్లో నడుము కనిపించేలా వయ్యారాలు పోయింది. ఇంతలా చూపిస్తే తట్టుకోవడం కష్టం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీపికా పిల్లిని బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. గతంలో […]

Written By: Shiva, Updated On : April 20, 2023 11:18 am
Follow us on

Deepika Pilli

Deepika Pilli: పాతికేళ్ల ప్రాయంలో పరువాల జడివానలో దీపికా పిల్లి తడిపేస్తోంది. ఆమె గ్లామర్ పవర్ కుర్రాళ్లకు షాక్ ఇస్తుంది. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మండే ఎండల్లో చల్లని సాగరతీరంలో దీపికా సేద తీరింది. కురచ బట్టల్లో నడుము కనిపించేలా వయ్యారాలు పోయింది. ఇంతలా చూపిస్తే తట్టుకోవడం కష్టం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Deepika Pilli

కాగా దీపికా పిల్లిని బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. గతంలో దీపికా ఢీ సీజన్ 13లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. డాన్స్ రియాలిటీ షో ఢీకి దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాంకర్ రష్మీ-దీపికా పిల్లి పోటీపడి మరి గ్లామర్ షో చేశారు. అదే సమయంలో మేల్ యాంకర్స్ తో రొమాన్స్ చేశారు. సుడిగాలి సుధీర్ తో రష్మీ జతకట్టగా, హైపర్ ఆదిని దీపికా తన జోడిగా ఎంచుకుంది. ఢీ సీజన్ 13 మంచి టీఆర్పీ రాబట్టింది.

Deepika Pilli

అనూహ్యంగా సీజన్ 14 నుండి దీపికను తప్పించారు. సుధీర్, రష్మీలను సైతం తీసేయడం కొసమెరుపు. తర్వాత మళ్ళీ దీపికా యాంకర్ గా కనిపించలేదు. అప్పుడప్పుడు సందడి చేయడం తప్పితే పూర్తి స్థాయి షో చేసింది లేదు. ఓటీటీలో మాత్రం ఒకటి రెండు షోలు చేశారు. ఆహాలో ఆ మధ్య కామెడీ ఎక్స్ఛేంజ్ పేరుతో ఓ కామెడీ షో ప్రసారమైంది. సుధీర్-దీపికా పిల్లి యాంకర్స్ గా చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి యాంకర్ గా వ్యవహరించారు.

Deepika Pilli

దీపికా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చారు. 2022లో విడుదలైన వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో దీపికా పిల్లి నటించారు. సునీల్, అనసూయ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో దీపికా పిల్లి ఓ రోల్ చేశారు. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. వాంటెడ్ పండుగాడ్ విజయం సాధిస్తే దీపికా కెరీర్ కి ప్లస్ అయ్యేది. దీపికా పిల్లి నటిగా, యాంకర్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.

Deepika Pilli

దీపికా పిల్లి సోషల్ మీడియా వేదికగా పాప్యులర్ అయ్యారు. టిక్ టాక్ లో దీపికా పిల్లికి మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ఉండేవారు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ చేశారు. అయినప్పటికీ ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫాలోయింగ్ కొనసాగించింది. ఆ విధంగా యాంకర్ ఛాన్స్ కొట్టేశారు. దీపికా పిల్లి నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి.