https://oktelugu.com/

CPI Narayana Vs Tamanna: సీపీఐ నారాయణను చెప్పుతో కొడుతానన్న తమన్నా.. హాట్ కామెంట్స్ వైరల్

CPI Narayana Vs Tamanna: ఎరక్కపోయి ఇరుక్కున్నారు మన సీపీఐ నారాయణ. ఆయనకేనా నోరు ఉన్నది మాకు లేదా? అని ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. నారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఏకంగా పరుష పదజాలంతో నారాయణను అదే బూతులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ టాప్ చానెల్ డిబేట్ లో సీపీఐ నారాయణపై బిగ్ బాస్ లో పాల్గొన్న ట్రాన్స్ జెండర్ తమన్నా విరుచుకుపడింది. ‘సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి’ అని బిగ్ బాస్ కంటెస్టెంట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2022 / 10:02 AM IST
    Follow us on

    CPI Narayana Vs Tamanna: ఎరక్కపోయి ఇరుక్కున్నారు మన సీపీఐ నారాయణ. ఆయనకేనా నోరు ఉన్నది మాకు లేదా? అని ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. నారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఏకంగా పరుష పదజాలంతో నారాయణను అదే బూతులతో విరుచుకుపడుతున్నారు.

    తాజాగా ఓ టాప్ చానెల్ డిబేట్ లో సీపీఐ నారాయణపై బిగ్ బాస్ లో పాల్గొన్న ట్రాన్స్ జెండర్ తమన్నా విరుచుకుపడింది. ‘సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి’ అని బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా అన్నారు. ఓ ఛానెల్ బిగ్ బాస్ కార్యక్రమంపై జరిగిన హాట్ హాట్ చర్చలో ఆమె ఈ కామెంట్ చేశారు.

    ఈ క్రమంలోనే తమన్నా ఏకంగా.. ఈ చర్చకు ‘సీపీఐ నారాయణ’ను కూడా పిలవాలని కోరడం విశేషం. బ్రోతల్ హౌస్ అన్నందుకు చెప్పుతో కొట్టేదాన్ని అని తమన్నా ఫైర్ అయ్యింది. ఇక అంత పెద్ద మనిషి.. సీపీఐ నారాయణను పట్టుకొని అలా అనడంతో చర్చలో పాల్గొన్న వారంతా షాక్ అయ్యారు.

    ఇక న్యూస్ యాంకర్ మాత్రం తమన్నాకు అండగా నిలిచింది. సీపీఐ నారాయణ బిగ్ బాస్ ను బ్రౌతల్ హౌస్ అనడం కూడా తప్పు అని.. తమన్నాకు సపోర్టు చేయడం విశేషం. ఎందుకంటే ఆ యాంకర్ కూడా గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్నది.

    ఇక మిగతా చర్చకు వచ్చిన వారు బిగ్ బాస్ ను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. అయితే మీకు ఇష్టం లేకపోతే చూడడం మానేయండి అంటూ తమన్నా ఎదురుదాడికి దిగడం విశేషం. మొత్తానికి తమన్నా మాటల మంటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.