Homeట్రెండింగ్ న్యూస్వాటాల కోసం పోలీసులు కొట్టుకున్నారు.. ముఖ్యమంత్రి నియోజకవర్గం లో సంచలనం

వాటాల కోసం పోలీసులు కొట్టుకున్నారు.. ముఖ్యమంత్రి నియోజకవర్గం లో సంచలనం

“కనిపించే ఆ మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమే రా ఈ పోలీస్”.. అని పోలీస్ స్టోరీ సినిమాలో పోలీసుల నిజాయితీ గురించి సాయి కుమార్ వీరలెవల్లో డైలాగులు చెబుతాడు. కానీ ఆ డైలాగులు సినిమాకు మాత్రమే పనికొస్తాయని.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంటుందని నిరూపించారు బీహార్ పోలీసులు. అక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గం నలంద పరిధిలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బీహార్ రాష్ట్రంలో ఇద్దరు పోలీసులు రోడ్డున పడిన ఘటన తాలూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ చూస్తుండగానే పోలీసులు ఒకరిని మరొకరు కొట్టుకోవడం సంచలనంగా మారింది. ఒకరి నుంచి వసూలు చేసిన డబ్బును పంచుకునే సందర్భంలో తేడా కొట్టి ఇద్దరూ కొట్టుకున్నట్టు తెలుస్తోంది..  ఈ ఇద్దరి మధ్య గొడవ పెరిగి సోషల్ మీడియాలో రచ్చకు ఎక్కింది. ఇంతలో వారిద్దరిని ఎవరో మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు ఇద్దరు కూడా 35 లోపే ఉండటంతో ఒకరిపై ఒకరు పిడుగులు గుద్దుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు సంబంధించిన పోలీసులు ఇద్దరు బీహార్ రాష్ట్రంలోని రాహుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహస్ రాయ్ హాల్ట్ సమీపంలో గొడవపడ్డారు. ఈ ఇద్దరు పోలీసుల తగాదా ఎస్పీ దాకా వెళ్లడంతో వారిద్దరిపై ఆయన శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వానికి ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు 112 ఎమర్జెన్సీ సర్వీసులో పనిచేస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడటం ద్వారా వచ్చిన డబ్బు పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో వారు ఘర్షణ పడ్డారు. తాము పోలీస్ యూనిఫాం లో ఉన్న సంగతి కూడా మర్చిపోయి కుస్తీ పట్టారు. నలంద నియోజకవర్గ పరిధిలోని 112 ఎమర్జెన్సీ సర్వీసులో పనిచేస్తున్న ఇద్దరు పోలీసులపై ఎస్పీ అశోక్ మిశ్రా చర్యలు తీసుకున్నారు. వారిని లూప్ లైన్ లోకి పంపించారు. ఒక పెద్ద వాహనం నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బు పంపిణీ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆ పోలీసుల వివరాలను ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సంఘటన జరిగిన ప్రాంతం నలంద నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, ఇది అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమని జాతీయ మీడియా చెబుతోంది. మరోవైపు ఈ వీడియోను చూసి బిజెపి నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఇండియా కూటమిని నడిపిస్తున్న నాయకుడి సొంత రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి బాగోతం ఇది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నితీష్ కుమార్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular