https://oktelugu.com/

పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచడానికి కారణం తెలుసా?

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఒక చెంబులో తీసుకొని భక్తులకు ఇవ్వడం మనం చూస్తుంటాము. అదే విధంగా మన ఇంట్లో కూడా స్వామివారికి ఒక చెంబులో నీటిని సమర్పిస్తుంటారు. ఈ విధంగా పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని భావిస్తారు. దేవుడికి సమర్పించే నైవేద్యం కన్నా నీటిని సమర్పించి పూజించడం ద్వారా సకల దేవతలు సంతృప్తి చెంది మన కోరికలను నెరవెరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఒక […]

Written By: , Updated On : January 27, 2021 / 01:28 PM IST
Follow us on

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఒక చెంబులో తీసుకొని భక్తులకు ఇవ్వడం మనం చూస్తుంటాము. అదే విధంగా మన ఇంట్లో కూడా స్వామివారికి ఒక చెంబులో నీటిని సమర్పిస్తుంటారు. ఈ విధంగా పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని భావిస్తారు. దేవుడికి సమర్పించే నైవేద్యం కన్నా నీటిని సమర్పించి పూజించడం ద్వారా సకల దేవతలు సంతృప్తి చెంది మన కోరికలను నెరవెరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఒక రాగి చెంబులో నీటిని ఉంచి మంత్ర పఠనం చేసిన తర్వాత ఆ చెరువులో ఉన్న నీటిని తాగటం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని భావిస్తారు. ప్రతిరోజు పూజ చేసే సమయంలో రాగి చెంబులో కొన్ని నీటిని దేవుడికి సమర్పించి అనంతరం ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని, సమస్త దోషాలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా నీటిని రోజు మార్చి రోజు ఎవరు తొక్కని చోట లేదా చెట్లకు పోయాలి.

పూజ చేసే సమయంలో ప్రతిరోజు ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలిగిపోయి, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా పూజ సమయంలో గంట కొట్టడం వల్ల దుష్ట శక్తులు సైతం తొలగిపోతాయి. పూజ చేసే సమయంలో ప్రకృతిని, పంచభూతాలను ఆరాధించడం వల్ల సమస్యలు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటం వల్ల మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి సుఖసంతోషాలతో గడుపుతారు.