https://oktelugu.com/

Rahul Ramakrishna Kiss: అమ్మాయికి లైవ్ లో లిప్ టు లిప్ ఘాటు కిస్..షాకిచ్చిన రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna Kiss: టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన రాహుల్ రామకృష్ణ తాజాగా షాకిచ్చాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రాహుల్ విభిన్న అంశాలపై స్పందిస్తూ కాంట్రావర్సీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఒక అమ్మాయికి లైవ్ లో ఘాటు ముద్దు పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరీ ఇంత బోల్డ్ గా.. అర్జున్ రెడ్డిలా తెలియజేయడం ఏంటని? అసలు ఈ ఫొటో వెనుక కథేంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : May 8, 2022 / 12:08 PM IST
    Follow us on

    Rahul Ramakrishna Kiss: టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన రాహుల్ రామకృష్ణ తాజాగా షాకిచ్చాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రాహుల్ విభిన్న అంశాలపై స్పందిస్తూ కాంట్రావర్సీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఒక అమ్మాయికి లైవ్ లో ఘాటు ముద్దు పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరీ ఇంత బోల్డ్ గా.. అర్జున్ రెడ్డిలా తెలియజేయడం ఏంటని? అసలు ఈ ఫొటో వెనుక కథేంటి అన్నది ఆసక్తిగా మారింది.

    Rahul Ramakrishna lip kiss

    ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక కమెడియన్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కమెడియన్ పాత్రలే కాదు.. విభిన్నమైన క్యారెక్టర్స్ కూడా ఎంచుకొని అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ లోనూ ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

    నటుడిగానే కాదు రచయితగా రాహుల్ రామకృష్ణ ఫేమస్. ఇతడి రైటింగ్ స్టైల్ చూసి చాలా మంది దర్శకులు పరిచయం పెంచుకున్నారు. కొన్ని కీలక సలహాలు సూచనలు స్వీకరిస్తారు. త్రివిక్రమ్ కూడా ‘అల వైకుంఠపురంలో’ ఓ కీలక అతిథి పాత్రలో రాహుల్ ను పెట్టడం విశేషం.

    Ramakrishna

    ఇక తాజాగా రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని విధంగా ట్వీట్స్ వేస్తూ ఉండడం విశేషం. ఎక్కువగా వివాదాలపై రాహుల్ రామకృష్ణ ఓపెన్ గానే కౌంటర్లు వేస్తున్నాడు. ఇటీవల ప్రముఖ మీడియా టీవీ9లో విశ్వక్ సేన్ ను అవమానించిన యాంకర్ దేవీపై ఫైట్ కు తాను రెడీ అని.. కావాలంటే నేను కూడా డిబేట్ కు వస్తాను అంటూ ఓపెన్ చాలెంజ్ విసిరాడు.

    Also Read: Professor Nageshwar: పొత్తులకు సైద్ధాంతికతతో పనిలేదు.. రాజకీయ వ్యూహల్లో భాగమేనంటున్న ప్రొఫెసర్ నాగేశ్వర్

    ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉంటున్న రాహుల్ రామకృష్ణ తాజాగా మరొక విషయాన్ని కూడా తెలియజేశాడు. ఒక అమ్మాయికి డైరెక్ట్ గా అర్జున్ రెడ్డి స్టైల్లో ఘాటు ముద్దు పెట్టాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని.. తన ప్రేయసి ఈమె అని ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేశారు. ‘పెళ్లికి సిద్ధమవుతున్నాను’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

    ఈ ఫొటో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.చాలా మంది ఓ ఇంటివాడవుతున్న రాహుల్ జీవితం సంతోషంగా గడవాలని శుభాకాంక్షలు అందజేశారు. ఇక కొందరేమో ఏదో వెబ్ సిరీస్ కోసం రాహుల్ రామకృష్ణ ఇలా హీరోయిన్ కు ఘాటు ముద్దు ఇచ్చి ఇలా షాకిచ్చాడు కావచ్చంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాహుల్ రామకృష్ణ ముద్దుగొడవ హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: Rajya Sabha Seats: రాజ్యసభ స్థానాలకు పార్టీ పల్లకి మోసేవారు వద్దు.. పారిశ్రామికవేత్తలే ముద్దు