
Chalaki Chanti Health: చలాకీ చంటి హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఏప్రిల్ 21న ఆయన గుండె నొప్పితో బాధపడ్డారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు హార్ట్ ఎటాక్ గా గుర్తించారు. వెంటనే ఐసీయూకి మార్చి ఆపరేషన్ నిర్వహించారు. వాల్వ్స్ లో బ్లాక్స్ గుర్తించిన వైద్యులు స్టెంట్ వేసినట్లు సమాచారం అందుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చలాకీ చంటి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. చలాకీ చంటి కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
చలాకీ చంటి హైదరాబాద్ లో చిన్న ఉద్యోగం చేస్తూ కెరీర్ మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు హుస్సేన్ సాగర్ బోటింగ్ లో మిమిక్రీ చేశాడు. అనంతరం రేడియో జాకీగా పని చేశాడు. చంటి బంటి అనే షో ఆయనకు పేరు తెచ్చింది. అలా చంటిగా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. భీమిలి కబడ్డీ జట్టుతో పాటు పలు చిత్రాల్లో చంటి చిన్న చిన్న పాత్రలు చేశాడు. చలాకీ చంటి ఫేట్ జబర్దస్త్ మార్చేసింది.

చలాకీ చంటి టీమ్ లీడర్ గా జబర్దస్త్ లో ఏళ్ల తరబడి నవ్వులు పంచారు. చలాకీ చంటి బుల్లితెర స్టార్ గా అవతరించారు. ఆయన సోలోగా కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరించారు. జబర్దస్త్ వేదికగా ఎదిగిన కమెడియన్స్ లో చంటి ఒకరు. అక్కడ సక్సెస్ అయ్యాక చంటికి సినిమా ఆఫర్స్ పెరిగాయి. ఆయన బుల్లితెర మీద సందడి చేస్తున్నారు.
గత ఏడాది ఆయన బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. సీజన్ 6 కంటెస్టెంట్స్ లో చలాకీ చంటి ఒకరు. అంచనాల మధ్య హౌస్లో అడుగుపెట్టిన చంటి నిరాశపరిచాడు. తాను సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నానని చంటి నేరుగా హోస్ట్ నాగార్జునకు చెప్పాడు. దీంతో ఆయన్ని ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ షోకి వెళ్లిన చలాకీ చంటి జబర్దస్త్ కి దూరమయ్యాడు.