https://oktelugu.com/

Nivetha Pethuraj: సినీ సెలబ్రెటీ బయోగ్రఫీ : విలాసవంతమైన జీవితాన్ని వదిలి సినిమాల్లోకి నివేత పేతురాజ్..

Nivetha Pethuraj: ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్స్ లో యాక్టింగ్ అద్భుతంగా చేసే హీరోయిన్స్ చాలా తక్కువ.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ అవకాశాలు సంపాదించాలని అనుకుంటారు,అలాంటి హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా నటనకి ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్స్ కూడా ఉన్నారు.. వారిలో ఒకరే నివేత పెతురాజ్..హాట్ అందాలతో ఒక పక్క కుర్రకారుల్ని పిచ్చెక్కిస్తూనే మరోపక్క నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకుంది.. తెలుగు తమిళ భాషలలో […]

Written By:
  • Shiva
  • , Updated On : February 6, 2023 / 02:13 PM IST
    Follow us on

    Nivetha Pethuraj

    Nivetha Pethuraj: ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్స్ లో యాక్టింగ్ అద్భుతంగా చేసే హీరోయిన్స్ చాలా తక్కువ.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ అవకాశాలు సంపాదించాలని అనుకుంటారు,అలాంటి హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా నటనకి ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్స్ కూడా ఉన్నారు.. వారిలో ఒకరే నివేత పెతురాజ్..హాట్ అందాలతో ఒక పక్క కుర్రకారుల్ని పిచ్చెక్కిస్తూనే మరోపక్క నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకుంది.. తెలుగు తమిళ భాషలలో ఇప్పటి వరకు ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలన్నీ ఒకసారి గమనిస్తే ఈమె పాత్రలు ఎంత బలంగా ఉంటాయో అర్థం అవుతుంది.. హీరోలలో విజయ్ సేతుపతి లాగా కేవలం హీరో రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఇచ్చే ఎలాంటి పాత్రనైనా చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన నివేత పేతురాజ్ బయోగ్రఫీ తెలుసుకుందాం.

    -బాల్యం/విద్యాబ్యాసం :

    నివేత పేతురాజ్ 1990వ సంవత్సరం నవంబర్ 30వ తారీఖున తమిళనాడు లోని మధురై ప్రాంతంలో జన్మించింది, తండ్రి తెలుగువాడు. తల్లి తమిళియన్..నివేత పెతురాజ్ పుట్టిన వెంటనే మధురై నుండి కోవిల్ పట్టి ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు..నివేత బాల్యం లోని విద్యాబ్యాసం మొత్తం అక్కడే జరిగింది, ఆ తర్వాత ఆమెకి 11 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు తల్లితండ్రులతో పాటుగా దుబాయ్ కి వెళ్ళిపోయింది..అక్కడ క్రిసెంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో చదువుకుంది.. తన డిగ్రీ కూడా హీరోయిట్ వాట్ యూనివర్సిటీ లో పూర్తి చేసింది.. అంతే కాదు UAEలో ప్రతీ ఏడాది నిర్వహించే మిస్ ఇండియా కాంపిటీషన్ లో 2015వ సంవత్సరానికి గాను ఈమె టైటిల్ ని గెల్చుకుంది.

    -కెరీర్ :

    ఆమె బాల్యం మొత్తం చూస్తూ ఉంటే పెద్దగా ఒడిదుడులు ఏమి ఎదురుకున్నట్టు అనిపించడం లేదు, చాలా లగ్జరీ జీవితాన్నే గడిపింది.. కానీ సినిమాల్లో అవకాశాలు సంపాదించడం అంటే అంత తేలికైన విషయం కాదు, సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి చాలా తేలికగా ఎంట్రీ ఉంటుంది కానీ, మిగిలిన వాళ్లకి చాలా కష్టం..నివేత పేతు రాజ్ కూడా సినిమాల్లో అవకాశాలు సంపాదించడం కోసం చాలా కష్టాలే పడింది..మిస్ ఇండియా కాంపిటీషన్ కి ముందు ఆమె చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చింది, కానీ ఒక్క సినిమాలో కూడా నటించే అవకాశం దక్కలేదు, ఎప్పుడైతే మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుందో అప్పటి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..అవకాశాలు దాని అంతటా అవే వచ్చాయి.

    టాలీవుడ్ లోకి అడుగుపెట్టేముందు ఆమె తమిళంలో రెండు సినిమాల్లో నటించింది..ఆమె మొదటి చిత్రం ‘ఓరు నాల్ కూతు’..2016 వ సంవత్సరం లో వచ్చిన ఈ చిత్రంలో నివేత ఒక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తర్వాత ఉదయ్ నిధి స్టాలిన్ తో ‘పొడువగా ఎన్ మనసు తంగం’ అనే చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సంవత్సరం శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది..ఈ సినిమా ఫర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. నివేత పేతురాజ్ కి కూడా నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతోనే ఆమె సైమా అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది.. ఇక ఆ తర్వాత ఆమె తమిళంలో చేసిన ‘టిక్ టిక్ టిక్’ అనే చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది..దాంతో ఆమెకి తమిళం లో వరుసగా రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

    Nivetha Pethuraj

    -చిత్రలహరి సినిమాతో కీలక మలుపు:

    సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, మంచి క్లాసిక్ గా కూడా నిలిచింది..సపోర్టింగ్ రోల్ అయ్యినప్పటికీ కూడా అద్భుతంగా నటించి మరోసారి సైమా అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది, ఇక ఆ తర్వాత ‘అలా వైకుంఠపురం లో’ , ‘బ్రోచేవారు ఎవరురా’, ‘రెడ్’ మరియు ‘పాగల్’ వంటి హిట్ చిత్రాలలో నటించిన నివేత పేతు రాజ్ ప్రస్తుతం విశ్వక్ సేన్ తో ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమాలో హీరోయిన్ నటిస్తోంది.. ఈ చిత్రం ద్వారా మరోసారి ఛాలెంజింగ్ రోల్ తో మన ముందుకి రాబోతున్న నివేత పేతు రాజ్ ప్రేక్షకులను ఎలా అలరించబోతుందో చూడాలి.

     

    Tags