Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Pawan Kalyan : అన్నయ్య మాస్ సాంగ్ అదుర్స్ అన్న తమ్ముడు... వాల్తేరు వీరయ్య...

Chiranjeevi Pawan Kalyan : అన్నయ్య మాస్ సాంగ్ అదుర్స్ అన్న తమ్ముడు… వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ ప్రోమో పై పవన్ ప్రశంస!

Chiranjeevi Pawan Kalyan :

వాల్తేరు వీరయ్య సెట్స్ లో సడన్ గా పవన్ ప్రత్యక్షమయ్యారు. దీంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో సరదా సంభాషణ చోటు చేసుకుంది. కాగా నేడు వాల్తేరు వీరయ్య మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ ప్రోమో విడుదల చేశారు. సదరు ప్రోమోను పవన్ కి ప్రత్యేకంగా ప్రదర్శించి చూపారు. ఇక బాస్ పార్టీ సాంగ్ ప్రోమో బాగుందని పవన్ టీమ్ ని ప్రశంసించినట్లు తెలుస్తుంది. దర్శకుడు బాబీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాల్తేరు వీరయ్య సెట్స్ లో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ చిత్ర విశేషాలు పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 

 

ఇక వాల్తేరు వీరయ్య మూవీ సెట్స్ ని పవన్ సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు, పవన్ లను ఒకే ఫ్రేమ్ లో చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగా పవన్ దూసుకుపోతున్నారు. అంతకంతకూ ఆయన ప్రజాభిమానం సొంతం చేసుకుంటున్నారు. జనసేన పార్టీకి చిరంజీవి సంపూర్ణ మద్దతు తెలపడంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న చిరంజీవి… ఏదో ఒకరోజు పవన్ ఉన్నత స్థానం అధిరోహిస్తారు, ప్రజలు ఆయనకు కట్టబెడతారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

 
కాగా వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.  రిలీజ్ కి సమయం దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. నవంబర్ 23 సాయంత్రం 4:05 నిమిషాలకు ‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదల కానుంది. విడుదలైన ప్రోమో ఆకట్టుకున్న నేపథ్యంలో సాంగ్ పై అంచనాలు పెరిగాయి. 
 

వాల్తేరు వీరయ్య కోసం దేవిశ్రీ మాస్ ఐటెం నెంబర్ స్వరపరిచారు. బాస్ పార్టీ సాంగ్ అదే అని తెలుస్తుంది. ఈ సాంగ్ లో చిరుతో కాలు కదిపేందుకు ముంబై నుండి ఊర్వశి రాతెలాను దించారు. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన దేవిశ్రీ బాస్ పార్టీ సాంగ్ తో దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున వాల్తేరు వీరయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ చిరంజీవికి జంటగా నటిస్తున్నారు. వీర సింహారెడ్డి మూవీతో బాలకృష్ణ కూడా సంక్రాంతి బరిలో దిగుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారింది. 

YouTube video player

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version