Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి..ఇది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు..కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు..ఎలాంటి అండదండా లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ తన స్వయంకృషి తో దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరో గా కొనసాగడం..తన కుటుంబ సభ్యులందరికి జీవితాన్ని ఇవ్వడం, ఎంతో మందికి ఆదర్శప్రాయం..ఏ రంగం లో ఉన్నవాడైన చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఎదగడానికి ప్రయత్నిస్తారు..ఇంత వయస్సు వచ్చిన తర్వాత కూడా ఆయన తాను నమ్ముకున్న కష్టాన్ని విడిచిపెట్టలేదు.

ఈ వయస్సు లో ఆయనకీ సినిమాలు చెయ్యాల్సిన అవసరం అసలే లేదు..తన మానవళ్లతో సంతోషంగా ఆడుకుంటూ కాలం గడిపేయొచ్చు..కొడుకు పాన్ వరల్డ్ స్టార్..తమ్ముడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో..వాళ్ళని చూసి ఆయన ఎంతో సంతృప్తిపడి ఇక సినిమాలకు స్వస్తి పలకొచ్చు..కానీ 70 ఏళ్ళ వయస్సు కి దగ్గరపడుతున్న కూడా ఇప్పటికి కష్టపడాలనే తత్త్వం ని నేటి తరం యువత మొత్తం ఆదర్శంగా తీసుకోవాలి.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఆయన ప్రముఖ కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘రంగ మార్తాండ’ అనే చిత్రాన్ని చూసాడు..సినిమా చూసిన తర్వాత కాసేపు ఆయన కృష్ణ వంశీ తో ముచ్చట్లు ఆడారు..ఈ సందర్భంగా మెగాస్టార్ భవిష్యత్తులో తాను చెయ్యబోతున్న కార్యాచరణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు..ఆయన మాట్లాడుతూ ‘ ఇంత కాలం నేను నా గురించి , నా కుటుంబం గురించి మాత్రమే ఆలోచించాను..వాళ్ళు బాగుంటే చాలు..గొప్ప స్థాయిలో స్థిరపడితే చూడాలనుకున్నాను..దేవుడి దయవల్ల అందరూ కెరీర్ పరంగా మహోన్నతమైన స్థానానికి చేరుకున్నారు.

దేవుడు నేను కోరుకున్న దానికంటే నాకు ఎక్కువే ఇచ్చాడు..ఆయన ఇచ్చిన దాంట్లో ప్రజలకు నేను ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను..త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కనీవినీ ఎరుగని రీతిలో సేవా కార్యక్రమాలు చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాను’ అంటూ చిరంజీవి ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..మెగాస్టార్ ఇలా మాట్లాడాడు అంటే త్వరలోనే ఆయన తన తమ్ముడు జనసేన పార్టీ లో చేరబోతున్నాడా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.