https://oktelugu.com/

Chiranjeevi Raviteja : రవితేజ గురించి ఎందుకు మాట్లాడలేదో బయటపెట్టిన చిరంజీవి

Chiranjeevi Raviteja : వాల్తేరు వీరయ్య మూవీలో ప్రెస్ మీట్ లో అందరి గురించి మాట్లాడిన చిరంజీవి.. ఈ సినిమాలో కీరోల్ పోషించిన రవితేజ గురించి మాట్లాడడం మరిపోయారు… ప్రీరిలీజ్ ఈ వెంట్ లో రవితేజ గురించి గొప్పగా మాట్లాడుదామనే ఆగారని తెలుస్తోంది. ఈ విషయంలో వివాదాలు రేపడంతో చిరంజీవి ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదానికి ముగింపు పలికారు. నిన్న చిరంజీవి రవితేజ గురించి మాట్లాడకపోవడంతో వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు రవితేజ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2022 / 07:11 PM IST
    Follow us on

    Chiranjeevi Raviteja : వాల్తేరు వీరయ్య మూవీలో ప్రెస్ మీట్ లో అందరి గురించి మాట్లాడిన చిరంజీవి.. ఈ సినిమాలో కీరోల్ పోషించిన రవితేజ గురించి మాట్లాడడం మరిపోయారు… ప్రీరిలీజ్ ఈ వెంట్ లో రవితేజ గురించి గొప్పగా మాట్లాడుదామనే ఆగారని తెలుస్తోంది. ఈ విషయంలో వివాదాలు రేపడంతో చిరంజీవి ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదానికి ముగింపు పలికారు.

    నిన్న చిరంజీవి రవితేజ గురించి మాట్లాడకపోవడంతో వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు రవితేజ గురించి మాట్లాడలేదని సోషల్ మీడియాలో కొందరు సహజంగానే డౌట్లు వ్యక్తం చేశారు. అయితే ఆ మరిచిపోయిన విషయంపై తాజాగా చిరంజీవి స్పందించారు. రవితేజపై ప్రశంసలు కురిపిస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేయడం విశేషం.

    వాల్తేరు వీరయ్య సినిమా గురించి చెప్పగానే అన్నయ్య సినిమాలో చెయ్యాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గరనుంచి కలిసి షూట్ చేసిన ప్రతీరోజు రవితో మళ్లీ ఇన్నేళ్లకు చేయడం నాకెంతో ఆనందంగా అనిపించిందని చిరంజీవి పేర్కొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయింటే వాల్తేరు వీరయ్య అసంపూర్తిగా ఉండేదన్నారు. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్ లో రవితేజ పాత్ర చాలా చాలా ఉందని ఈ విషయంలో త్వరలో మాట్లాడుదాం అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    మెగాస్టార్ చిరంజీవి నిన్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా ఆ సినిమా కోసం కష్టపడ్డ వారందరి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ప్రతీ ఆర్టిస్ట్, టెక్నిషియన్ పై వివరంగా వివరించారు. అయితే చిరంజీవి తర్వాత ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రవితేజ గురించి ఆ బిజీలో చెప్పడం మరిచిపోయారు. ప్రెస్ మీట్ ముగిశాకే చిరు రవితేజ గురించి మాట్లాడడం మరిచిపోయానని తెలిసింది. అయితే అప్పటికే ప్రెస్ మీట్ ముగిసి కారులో బయలు దేరడంతో చిరంజీవి బాధపడ్డారు. ‘‘వాల్తేరు వీరయ్య టీం అందరితో , మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా ముగిసిందని.. చిత్రం విడుదలకు ముందు జరిగినా.. టీం అందరూ సంతోషంగా ఈ జర్నీలో వాళ్ల జ్ఞాపకాలు పంచుకున్నారు. ప్రీరిలీజ్ ఈవెంటు ముందు ఉండడంతో క్లుప్తంగా మాట్లాడుదామని ఆగాను. చిత్రంలో నా తమ్ముడు, వీరయ్యకు అతి ముఖ్యుడు, రవితేజ గురించి చెప్పడం మరిచిపోయాను. వచ్చేటప్పుడు అంతా ఈ విషయమై వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్ చేస్తున్నారు. ’ అని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.