Chiranjeevi | Ram Charan | Acharya Twitter Review : చిరంజీవి-రాంచరణ్ ‘ఆచార్య’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Chiranjeevi | Ram Charan | Acharya Twitter Review :  మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ మూవీ విడుదలైంది. నిన్న రాత్రియే ప్రీమియర్స్ ప్రపంచవ్యాప్తంగా పడ్డాయి. దీంతో టాక్ బయటకు వచ్చింది. ఓవర్సీస్ లో.. హైదరాబాద్ లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకున్నారు. చిరంజీవి, రాంచరణ్ లు తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీకి ఓటమి ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించారు. […]

Written By: NARESH, Updated On : April 29, 2022 1:22 pm
Follow us on

Chiranjeevi | Ram Charan | Acharya Twitter Review :  మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ మూవీ విడుదలైంది. నిన్న రాత్రియే ప్రీమియర్స్ ప్రపంచవ్యాప్తంగా పడ్డాయి. దీంతో టాక్ బయటకు వచ్చింది. ఓవర్సీస్ లో.. హైదరాబాద్ లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకున్నారు.

Chiranjeevi | Ram Charan | Acharya Twitter Review

చిరంజీవి, రాంచరణ్ లు తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీకి ఓటమి ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2వేలకు పైగా స్క్రీన్ లలో విడుదలవుతోంది.

Also Read: Koratala Siva- NTR Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మే 20న ఇక రచ్చ రచ్చే !

తెలంగాణలో ఐదో ఆటతోపాటు వారం రోజుల పాటు ఈ సినిమాను రూ.50 పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇక ఏపీలో 10 రోజుల పాటు 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే బుకింగ్స్ మెగా అంచనాలకు తగ్గట్టు లేదనే టాక్ నడిచింది. ఆర్ఆర్ఆర్, కేజీఎప్2 సినిమాల హైప్ తో పోలిస్తే తక్కువగా ఉందని అంటున్నారు.

ఆచార్య మూవీ 132.50 కోట్ల టార్గెట్ తో విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ సినిమా ఎలా ఉంది? అసలు కథేంటి? అన్నది బయటకు వచ్చింది.

ఈ సినిమా చూసిన కొందరు ట్విట్టర్ లో పంచుకున్నారు. చొక్కా విప్పేసేలా సీన్లు ఉన్నాయని.. సెకండాఫ్ అదిరిపోయిందని.. ఫైట్స్, పాటలు, క్లైమాక్స్ లో చిరు విశ్వరూపం మామూలుగా ఉండదని అన్నారు. బట్టలు చించుకోవాల్సిందే.. కొరటాల మార్క్ స్టోరీ టెల్లింగ్ సూపర్ అంటున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

ఇక ఫస్టాఫ్ ఎబో యావరేజ్.. ఇంటర్వెల్ సీన్ లో సిద్దా ర్యాంప్ అంతే.. చిరు-చరణ్ మధ్య సీన్స్ సూపర్బ్ గా ఉంటాయి.. సెకండాఫ్ చరణ్ కేక.. మణిశర్మ బీజీఎం బాగుందంటున్నారు. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.

https://twitter.com/_GopiTarak/status/1519858560825319424?s=20&t=Y9cSpz6ZEdmjEk-7fay5CA

ఇక కొందరు విమర్శలు గుప్పించారు. ఈ సినిమాలో హైమూమెంట్స్ లేవని.. తండ్రీ కొడుకుల మధ్య సీన్లు అద్భుతమన్నారు. బీజీఎం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.. స్టోరీ వీక్, స్క్రీన్ ప్లే స్లోగా ఉందన్నారు. ఫ్యాన్స్ కు పండుగేనని.. కానీ నా రేటింగ్ 2/5 అని ట్విట్టర్ లో నెటిజన్ కామెంట్ చేశాడు.

సెకాండాఫ్ ను రాంచరణ్ తన భుజాల మీద మోశాడని.. చిరంజీవి యాక్టింగ్ గ్రేట్ అని.. వీఎఫ్ఎక్స్ సరిగా లేవని.. కొంచెం సాగదీసినట్టు ఫస్టాఫ్ ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

https://twitter.com/JeevaNithishh/status/1519858549731786752?s=20&t=tXZXxIUppg0KQwxS3pydnw

రాంచరణ్ పెర్ఫామెన్స్, ఎమోషనల్ సీన్లు కంటతడి పెట్టించేలా ఉంటాయని.. ఫ్యాన్స్ స్టఫ్ మూవీ అని ఇంకో నెటిజన్ ట్విట్టర్ లో మెసేజ్ చేశాడు.

Also Read:RRR: లేటెస్ట్ కలెక్షన్స్.. ఎన్ని వందల కోట్లో తెలిస్తే షాకే !

Recommended Videos: