https://oktelugu.com/

Chiranjeevi Movie Effect: చిరంజీవి సినిమా ఎఫెక్ట్.. యముడికి భక్తుడిగా మారిన వ్యక్తి

Chiranjeevi Movie Effect: మన దేశంలో ఆలయాలకు కొదవ లేదు.. దేవుళ్లకు కొలిచే వారు తక్కువ లేరు. సురా 30 కోట్ల మంది హిందూ దేవుళ్లను పూజిస్తుంటాం.. కానీ ఆలయాలు మాత్రం ఎక్కువగా విష్ణు, మహేశ్వరులకే ఎక్కువగా ఉంటాయి. బ్రహ్మకు కూడా దేశంలో తక్కువనే. ఇక అమ్మవారి ఆలయాలు ఆ తర్వాత ఉంటాయి. అందరి దేవుళ్లకు పూజలు జరిగినా.. ఒక్క యమ ధర్మరాజుకు మాత్రం ఎక్కడ ఆలయాలు కట్టరు.. పూజలు చేయరు. మన ప్రాణాలు తీసే యముడికి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2022 / 03:05 PM IST
    Follow us on

    Chiranjeevi Movie Effect: మన దేశంలో ఆలయాలకు కొదవ లేదు.. దేవుళ్లకు కొలిచే వారు తక్కువ లేరు. సురా 30 కోట్ల మంది హిందూ దేవుళ్లను పూజిస్తుంటాం.. కానీ ఆలయాలు మాత్రం ఎక్కువగా విష్ణు, మహేశ్వరులకే ఎక్కువగా ఉంటాయి. బ్రహ్మకు కూడా దేశంలో తక్కువనే. ఇక అమ్మవారి ఆలయాలు ఆ తర్వాత ఉంటాయి.

    east godavari konaseema man

    అందరి దేవుళ్లకు పూజలు జరిగినా.. ఒక్క యమ ధర్మరాజుకు మాత్రం ఎక్కడ ఆలయాలు కట్టరు.. పూజలు చేయరు. మన ప్రాణాలు తీసే యముడికి ఆలయాలు పెద్దగా లేవు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంకు చెందిన ఒక వ్యక్తికి మాత్రం యమ ధర్మరాజు అంటే పిచ్చి భక్తి. ఆయనకు భక్తుడిగా మారిపోయాడట.

    Also Read: VB Rajendra Prasad- Acharya Atreya: ఆత్రేయని మేపలేక కడుపు మండిపోయింది.. దిగ్గజ నిర్మాత సంచలన ఆరోపణలు

    చిరంజీవి నటించిన ‘మంజునాథ’ సినిమా చూసి యముడికి భక్తుడైపోయాడు ఈ వ్యక్తి. అందులో ఎన్ని పూజలు చేసినా శివ భక్తుడిని యమ ధర్మరాజు పాశం వేసి తీసుకెళుతాడు. చావు విషయంలో అందర్నీ సమానంగా సమవర్తిగా చూసే యమ ధర్మరాజు అంటే అప్పటి నుంచి అభిమానం ఏర్పడిందని..అందుకే యముడిని తన ఒంటిపై పచ్చబొట్టు కూడా వేసుకొని అప్పటి నుంచి ఆరాతీస్తున్నాడు ఈ వ్యక్తి.యముడికి పరమ భక్తుడైపోయాడు.

    Chiranjeevi

    కలలో కూడా భయపడే యముడిని ఈయన నిత్యం స్మరించుకుంటూ ఉంటాడు. ఎవరెన్ని చెప్పినా యమధర్మరాజును నిత్యం పూజిస్తూనే ఉంటాడు. నిత్యం తలుచుకుంటే చావంటే భయం పోయి తనకు మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నాడు.

    Also Read:Puri Jagannadh- Charmi: పూరి-ఛార్మికి అసలు కష్టాలు మొదలు!

     

     

    Tags