
Chiranjeevi: నిన్న మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి ఊపు మామూలు రేంజ్ లో ఉండేది కాదు.ఒక ఏడాది వ్యవధి లో ఆయన మూడు సినిమాలను విడుదల చేసి ఆగష్టు నెలలో మళ్ళీ ‘భోళా శంకర్’ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది.
కుర్ర హీరోలకు కూడా సాధ్యపడని రేంజ్ స్పీడ్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే తన స్పీడ్ కి బ్రేక్ ఇవ్వబోతున్నాడా..?, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండు మూడు సినిమాలను ప్రకటించే మెగాస్టార్ చిరంజీవి, భోళా శంకర్ తర్వాత ఆయన చెయ్యబోతున్న సినిమా మీద ఇప్పటి వరకు ఎందుకు మౌనం వహిస్తున్నాడు..?, కొంపదీసి ఆయన సినిమాలు మానేస్తున్నాడా అనే భయం అభిమానుల్లో నెలకొంది.
‘వాల్తేరు వీరయ్య’ ప్రొమోషన్స్ సమయం లో మెగాస్టార్ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో ‘భోళా శంకర్’ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా మరియు #RRR మూవీ మేకర్స్ డీవీవీ దానయ్య తో మరో సినిమా చెయ్యబోతున్నట్టుగా చెప్పాడు.అయితే డైరెక్టర్స్ ఎవరో ఇంకా ఖరారు కాలేదని,కథలు వింటున్నాని చెప్పుకొచ్చాడు.అయితే ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, చిరంజీవి ఇక నుండి స్క్రిప్ట్ ఎంపిక విషయం లో ఆచి తూచి అడుగులు వెయ్యాలని అనుకుంటున్నాడు.

అందుకే సరైన స్క్రిప్ట్ తగిలేవరకు సినిమా చెయ్యకూడదని, కొంతకాలం బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట మెగాస్టార్.ఇది వరకే పూరి జగన్నాథ్, వెంకీ కుడుముల మరియు రీసెంట్ గా ‘దసరా’ తో సెన్సేషన్ సృష్టించిన శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కి కథ చెప్పాడట.మరి ఈ ముగ్గురిలో మెగాస్టార్ ఎవరికీ గ్రీన్ ఇస్తాడో అని అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.