https://oktelugu.com/

Chiranjeevi Daughter Sreeja: నేను బతకడానికి నాకు సంతోషాన్ని ఇచ్చేది ఇవే – మెగా డాటర్ ‘శ్రీజ’

Chiranjeevi Daughter Sreeja: మెగా డాటర్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తన అన్నయ్య మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో కలిసి శ్రీజ ముంబై మహా నగరంలో ప్రత్యక్షమైంది. తన చెల్లెలు శ్రీజతో కలిసి రామ్‌ చరణ్‌ ముంబై వచ్చాడు. ఎయిర్‌ పోర్టు ఆవరణలో చెర్రీ తన చెల్లితో […]

Written By:
  • Shiva
  • , Updated On : January 30, 2022 / 04:42 PM IST
    Follow us on

    Chiranjeevi Daughter Sreeja: మెగా డాటర్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తన అన్నయ్య మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో కలిసి శ్రీజ ముంబై మహా నగరంలో ప్రత్యక్షమైంది. తన చెల్లెలు శ్రీజతో కలిసి రామ్‌ చరణ్‌ ముంబై వచ్చాడు. ఎయిర్‌ పోర్టు ఆవరణలో చెర్రీ తన చెల్లితో ఫోటోలు కూడా దిగాడు.

    Chiranjeevi Daughter Sreeja

    కాగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌‌ గా మారాయి. అయితే, శ్రీజతో కలిసి చెర్రీ ముంబైకి ఎందుకు వెళ్లాడన్న విషయం పై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చెల్లితో క‌లిసి ముంబైలో రామ్ చ‌ర‌ణ్‌ కనిపించడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక తన అన్నయ్య రామ్‌ చరణ్‌ తో కలిసి దిగిన ఫోటోలను శ్రీజ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైగా ఆ ఫొటోలతో పాటు ఆమె ఒక ఎమోషనల్ మెసేజ్ కూడా పెట్టడం విశేషం.

    ఇంతకీ, శ్రీజ ఏమి మెసేజ్ పెట్టింది అంటే.. తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేస్తూ.. ‘హగ్స్ అండ్‌ హగ్స్‌.. నేను బతకడానికి నాకు సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న విషయాలివే’ అంటూ శ్రీజ ఎమోషనల్‌ అయ్యింది. ఫోటోల్లో రామ్‌చరణ్‌ పెట్‌ రైమ్‌ కూడా ఉంది. అన్నట్టు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన చెల్లితో ముంబై వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టాడట. చరణ్ కి తన చెల్లెలు శ్రీజ అంటే ప్రాణం.

    మెగా ఫ్యామిలీలో శ్రీజను ఎంతో అభిమానంగా చూస్తారు. ముఖ్యంగా మెగాస్టార్ కి శ్రీజ అంటే ప్రత్యేకమైన ప్రేమ. అందుకే, చిరు ఎప్పుడూ శ్రీజను గారాబం చేస్తూ ఉంటారట. అయితే, ఈ మధ్య తన భర్త కళ్యాణ్ దేవ్ ను, శ్రీజ దూరం పెట్టింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ – శ్రీజ మధ్య అస్సలు పొసగడం లేదంటూ పుకార్లు వైరల్ అవుతున్నాయి. మెగా డాటర్ మరోసారి విడాకుల వైపు అడుగులు వేసిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

    Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్!

    ఇప్పటికే శ్రీజ, తన పేరు నుంచి కళ్యాణ్ దేవ్ పేరును తీసేసింది. భర్తకు దూరం అవుతున్నట్లు ఆమె ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో సమంత కూడా మొదట ఇలాగే చేసింది. తన పేరుకు ముందు ఉన్న అక్కినేని పేరును ఆమె తీసేసింది. ఆ తర్వాత అక్కినేని కుటుంబానికి దూరం అయింది. ప్రస్తుతం శ్రీజ పరిస్థితి కూడా అదే అని తెలుస్తోంది.

    Also Read: Megastar Chiranjeevi: మెగాస్టారే స్వయంగా కవిత అల్లి పోస్ట్ చేస్తే, వైరల్ కాకపోతే ఎలా ?

    Tags