China Police Posts: అగ్రరాజ్యంగా ఎదగాలని ఆశపడుతున్న చైనా ఈ మేరకు ప్రపంచంపై తన ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించడానికి రెడీ అయ్యింది. అన్ని దేశాల్లోనూ సీక్రెట్ గా తమ దేశానికి చెందినవారితో నిఘాను పెంచిపోషిస్తోంది. ఈ క్రమంలోనే మూడో కంటికి తెలియకుండా విదేశాల్లో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. తనను తాను శక్తివంతంగా మార్చుకునేందుకు రెడీ అయ్యింది.

చైనాలో మానవ హక్కుల కార్యకర్తలను రోజురోజుకు తన చర్చలతో అణిచివేస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆయా దేశాల్లో చైనా తన పరిధిని సులువుగా విస్తరింపచేసుకొని ఎలాంటి భయం లేకుండా అక్కడి లా అండ్ ఆర్డర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు సమాచారం.
Also Read: KCR National Party- AP: కేసీఆర్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీలో ఎలా ఉండబోతుంది?
దాదాపు 21 దేశాల్లో చైనా ఇలాంటి 30 అక్రమ పోలీస్ స్టేషన్లను నిర్మించిందని ఓ నివేదిక వెల్లడించింది. కెనడాలోని పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోకు అనుబంధంగా ఉన్న ఇటువంటి అనధికారిక పోలీస్ సేవా స్టేషన్లు.. చైనా ప్రత్యర్థులను ఎదిరించేందుకే ఏర్పాటు చేసినట్టు స్థానిక మీడియా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో బయటపడింది.కెనడా అంతటా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలకు అనధికారిక పోలీస్ సర్వీస్ స్టేషన్లు అనుబంధంగా ఉన్నాయట.

ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా చైనా ప్రభుత్వం.. కొన్ని దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాల్లో కూడా చైనా పోలీస్ స్టేషన్ల కోసం ఇటువంటి వ్యవస్థలను ఏర్పాటుచేసినట్టు తెలిసి ప్రపంచదేశాలన్నీ అవాక్కయ్యాయి. చైనా ప్రపంచంపై ఆధిపత్యం కోసం చేస్తున్న ఈ కుట్రలపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Also Read:Balakrishna Meeting in Vijayawada: విజయవాడలో బాలక్రిష్ణ భారీ బహిరంగ సభ.. ఎందుకు పెడుతున్నాడబ్బ?
[…] […]