Vishnu Manchu- Naga Babu: ఇటీవల మీడియా సమావేశం లో పాల్గొన్న మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనపై వస్తున్న ట్రోల్స్ కి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కారణం అన్నారు. ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడని మంచు విష్ణు ఐపీ అడ్రెస్ల ఆధారంగా ట్రోల్స్ కి పాల్పడుతుంది ఎవరో కనిపెట్టామన్నారు. మంచు విష్ణు ఆ కామెంట్ చేసిన నాటి నుండి ఆయన మెన్షన్ చేసిన నటుడు ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. తెలుసుకోవాలనే ఆత్రుత పెరిగిపోయింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం మంచు విష్ణు చెప్పిన ఆ నటుడు నాగబాబు అంటున్నారు.

నాగబాబుతో మంచు విష్ణుకు శత్రుత్వం ఉన్న నేపథ్యంలో ఈ వాదన తెరపైకి వచ్చింది. మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ తలపడ్డారు. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ పూర్తి మద్దతు ప్రకటించింది. నాగబాబు అన్నీ తానై వ్యవహరించారు. ప్రకాష్ రాజ్ ని గెలిపించాలని క్యాంపైన్ చేశారు. ఇక మంచు విష్ణు కి మద్దతుగా మాజీ అధ్యక్షుడు నరేష్ నిల్చున్నాడు. సార్వత్రిక ఎన్నికలను తలపించిన మా ఎన్నికలు అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాయి.
Also Read: Sudigali Sudheer- Rashmi: సుడిగాలి సుధీర్ ఆ మాటనే యాంకర్ రష్మీ కెరీర్ నాశనానికి కారణమా?
ముఖ్యంగా నరేష్-నాగబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఫైనల్ గా మంచు విష్ణు వర్గానిదే పైచేయి అయ్యింది. ప్రకాష్ రాజ్ ని ఓడించి మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎన్నికల పలితాలతో మనస్తాపానికి గురైన నాగబాబు ఏకంగా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలా ఆ వివాదం ముగిసింది. ఎన్నికల తర్వాత మంచు విష్ణు, నాగబాబు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు.

తాజాగా మంచు విష్ణు తనపై ట్రోల్స్ కి కారణం ప్రముఖ నటుడని ఆరోపణలు చేయడంతో నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. సైబర్ క్రైమ్ విభాగంలో మంచు విష్ణు చేసిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా… జూబ్లీహిల్స్ లోని ఒక సాఫ్ట్ కంపెనీతో పాటు నటుడు ఆఫీస్ కి సంబంధించిన కంప్యూటర్స్ ఐపీ అడ్రెస్లు దొరికాయని మంచు విష్ణు ఆరోపణ. ఆయన నాగబాబు పేరు ప్రస్తావించకున్నప్పటికీ సోషల్ మీడియాలో ఈ వాదన మొదలైంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.
Also Read:Balakrishna Meeting in Vijayawada: విజయవాడలో బాలక్రిష్ణ భారీ బహిరంగ సభ.. ఎందుకు పెడుతున్నాడబ్బ?
[…] […]