China Loan Apps: ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో డబ్బు సర్దుబాటు కోసం ప్రజలు పలు యాప్ లను ఆశ్రయిస్తున్నారు. దీంతో లోన్ యాప్ లు మోసంతో ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రుణాలు చిటికెలో ఇస్తున్నా వసూలు చేయడంలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది వీటికి బలైపోతున్నారు. రుణగ్రహీతలను వేధిస్తూ వారిని తిప్పలు పెడుతున్నాయి.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆన్ లైన్ లోన్ల పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ యాప్ లన్ని చైనా ఆధిపత్యంలో నడుస్తున్నాయని తెలిపింది. వీటిపై కేంద్ర ప్రభుత్వం అజమయిషీ ఉండటం లేదు. దీంతో డబ్బు రాబట్టుకునే నేపథ్యంలో వారు తీసుకునే చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా ఆధీనంలో ఉండే యాప్ లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. నేషనల్ సెక్యూరిటీ, ఆర్థిక వ్యవస్థ, నెటిజన్ల సెక్యూరిటీపై ఈ యాప్ లు ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రజలు దేశీయ బ్యాంకుల్లో మాత్రమే రుణాలు తీసుకోవాలని, చైనా సంస్థలను నమ్మి మోసపోవద్దని చెబుతోంది.
దేశవ్యాప్తంగా ఎన్నో యాప్ లు ప్రజలను ఆకర్షించి ఎక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. తిరిగి తీసుకునే క్రమంలో వారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కేంద్రం పేర్కొనడం గమనార్హం. తక్కువ ఆదాయమున్న వారిని టార్గెట్ చేసుకుని ఈ యాప్ లు వారికి తక్కువ వడ్డీకే ఇస్తున్నట్లు నమ్మించి తరువాత బెదిరింపులకు గురిచేస్తున్నాయి. రుణ గ్రహీతలను బ్లాక్ మెయిల్, బెదిరింపులకు గురిచేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. తీసుకున్న రుణాలు తీర్చలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం కూడా తెలిసిందే.

ఈ యాప్ లు ఆర్బీఐ నియంత్రణలో ఉండవు. బల్క్ ఎస్ఎంఎస్, డిజిటల్ యాడ్స్, చాట్ మెసెంజర్స్, యాప్ స్టోర్స్ ద్వారా డ్రాగన్ లెండింగ్ యాప్స్ ప్రజలకు దగ్గరవుతున్నాయి. ఆదాయం తక్కువా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని సులభంగా డబ్బు వస్తుందనే ఉద్దేశంతో రుణాలు చేస్తున్నారు. తరువాత వారు పెట్టే బాధలు అన్ని ఇన్ని కావు. యాప్స్ సంస్థలు తీసుకునే చర్యలతో రుణం తీసుకున్న వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాగైనా రుణం రాబట్టుకోవాలనే కఠిన నిర్ణయాలు తీసుకోవడం వివాదాలకు కారణమవుతోంది.