Chilla Chilla Thunivu Lyric Song : స్టార్ హీరోల సినిమాల ట్రైలర్, వారి సినిమా పాటలు ఎప్పుడైనా ట్రెండింగ్ గా మారుతాయి. అశేష అభిమానులున్న సినిమా హీరోలవి అయితే తొందరగా వైరల్ అవుతాయి. అయితే స్టార్ హీరోలవే కాదు.. సామాన్యులు వినసొంపుగా పాటలు రూపొందిస్తే అవి కూడా జనబాహుల్యంలోకి పోతాయి. ‘బుల్లెట్ బండి’ సాంగ్ అలా వెళ్లింది.

తమిళ హీరోల పాటలు కూడా ఈ మధ్య దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ‘విజయ్’ ‘వారసుడు’ సినిమాలోని పాట కూడా ఇలానే దేశవ్యాప్తంగా వైరల్ అవ్వగా.. తాజాగా అజిత్ వంతు వచ్చింది. తల అజిత్ తాజా యాక్షన్ చిత్ర ‘తునివు’ నుంచి విడుదలైన ‘చిల్లాచిల్లా’ పాట ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేయగానే ట్రెండింగ్ గా మారింది.
తునివు తెలుగులో ‘తెగింపు’ పేరుతో డవ్ అవుతోంది. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ఈ ఫస్ట్ సాంగ్ కు ‘జిబ్రాన్’ సంగీతం అందించారు. మరో సంగీత దర్శకుడు ‘అనిరుధ్’ పాడడం విశేషం. అనిరుధ్ పాట ‘చిల్లా చిల్లా’ పాటకు ప్రాణం పోసింది. అజిత్ అభిమానుల్లో ఇప్పుడు ‘చిల్లా చిల్లా’ పాట జోష్ నింపింది. ఈ సినిమా ప్రమోషన్స్ కు మంచి ఊపు తెచ్చింది.
ఈ పాటలో అక్కడక్కడ ‘అజిత్’ డ్యాన్స్ వేస్తున్న విజువల్స్ కూడా ఉండడంతో అజిత్ ఫ్యాన్స్ ఈ సాంగ్ ను యూట్యూబ్ లో రిపీట్ మోడ్ లో చూస్తున్నారు. గత 24 గంటల్లోనే అత్యధిక వీక్షకులను పొందిన వీడియోగా ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ రెండోస్తానంలో నిలిచింది.
చిల్లాచిల్లా సాంగ్ రిలీజ్ అయిన 15 గంటల్లోనే 7.5 మిలియన్స్ వ్యూస్ సాధించింది. 980K లైక్స్ రాబట్టి టాప్ ట్రెండింగ్ లో ఉంది.
జనవరి 11న ఈ ‘తునివు’ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులోనూ ‘తెగింపు’ పేరుతో ఈ సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ కూడా ఇప్పుడే విడుదలవుతోంది. జనవరి 12న ఇది విడుదలవుతోంది. ఈ ఇద్దరిలో ఎవరు హిట్ కొడుతారన్నది ఆసక్తి రేపుతోంది.