Bigg Boss Telugu 6: బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. ఇక మూడు నెలల పాటు ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసేందుకు రంగం సిద్ధమైంది. టాప్ రేటింగ్ తో దూసుకుపోయే ఈ రియాలిటీ షోకు అనౌన్స్ జరిగిపోవడంతో ఇప్పుడు ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే బిగ్ బాస్ 5 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ ను అధికారికంగా ప్రకటించారు. గత మూడు సీజన్స్ హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జుననే మరోసారి బిగ్ బాస్ 6ను ముందుకు నడిపించబోతున్నాడు. బిగ్ బాస్ 6 ప్రకటన వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. పలు పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ అని లీక్ కావడం హాట్ టాపిక్ గా మారింది.
పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ చిన్నది ఇప్పుడు పెరిగి పెద్దది అయి హీరోయిన్ కటౌట్ లా ఎదిగింది. వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా నటించిన ‘సుధీప’ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసిన ఈ అమ్మాయి ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆమె ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించేందుకు ఈమెను సంప్రదించి బిగ్ బాస్ లోకి వచ్చేందుకు ఒప్పించినట్టు సమాచారం.
ప్రస్తుతం సుధీప హీరోయిన్ కటౌట్ లా ఉంటుందట.. చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత ఈమె సినిమాల్లో నటించలేదు. కనీసం హీరోయిన్ గానూ పరిచయం కాలేదు. ఇప్పుడామె ఎక్కడుంది? ఎలా ఉంది? ఏం చేస్తుందన్నది ఎవరికీ తెలియదు. అలాంటి ఆమెను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేయబోతోందట.. ఆ సర్ ప్రైజ్ కోసమే బిగ్ బాస్ ఆమెను ఎవరికీ కనిపించనీయవద్దని చెప్పినట్టు తెలిసింది. మరి ఈమె ఎలా ఉంటుందన్నది టీవీలోనే చూడాలి.