https://oktelugu.com/

Chhatrapati Shivaji Jayanti: ఛత్రపతి శివాజీ జయంతి.. రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్న వీడియోలు..

దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మరాఠాల స్వరాజ్యం కోసం పోరాడి ప్రాణాలు సైతం లెక్కచేయని యోధుడిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కు పేరుంది. అతడిని మరాఠీ ప్రజలు తమ ప్రాంత యోధుడిగా కీర్తిస్తారు.

Written By: , Updated On : February 19, 2025 / 04:20 PM IST
Chhatrapati Shivaji:

Chhatrapati Shivaji:

Follow us on

Chhatrapati Shivaji Jayanti: అతని వృత్తాంతాన్ని తీసుకొని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఛత్రపతి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హీరో ప్రభాస్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో “అగ్నిస్ఖలన” అనే పాట ఇప్పటికి చార్ట్ బస్టర్ గా ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ పాటను బ్యాక్ గ్రౌండ్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ వృత్తాంతాన్ని వెల్లడించేలా ఓ వీడియోని రూపొందించారు. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కావడంతో.. ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. చాలామంది ఈ వీడియోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకున్నారు. మరాఠాల స్వరాజ్యం కోసం పోరాడి ప్రాణాలు సైతం లెక్కచేయని యోధుడిలాగా శివాజీ మహారాజ్ నిలిచిపోయారని చాలామంది కామెంట్లు పెట్టుకున్నారు.

రోమాలు నిక్కబొడిచేలా ఉన్న వీడియో

ఇక అదే కాక మరో వీడియో కూడా సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. ఛత్రపతి శివాజీ గొప్పవాడు కావడానికి కారణం తన తల్లి జిజియాబాయి. చిన్నప్పుడే శివాజీకి ఉగ్గుపాలతో పాటు పౌరుషం కూడా నేర్పింది. దేశం గొప్పదనం గురించి వివరించింది. దేశ ఔన్నత్యాన్ని అవపోసన పట్టేలా చేసింది. వెన్నపాలతో దేశం వీరత్వాన్ని వివరించింది. ధర్మాన్ని కాపాడేందుకు.. న్యాయాన్ని నిలబెట్టేందుకు.. సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించేందుకు.. ఎలాంటి కృషి చేయాలో వివరించింది. అది ఒంట పట్టించుకున్న శివాజీ.. తన చివరి శ్వాస వరకు వాటి కోసమే పోరాడాడు. మరాఠాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు. మరాఠాల స్వాభిమానాన్ని గెలుచుకున్నాడు. బతికి ఉన్నంతకాలం వీరుడిగానే జీవించాడు. తనను నమ్ముకున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పోరాటం చేశాడు. అందువల్లే అతడు ఛత్రపతి బిరుదాంకితుడయ్యాడు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఛత్రపతి శివాజీ గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ” ఆయన తల్లి జిజియా బాయి చిన్నప్పటినుంచి అతనిలో వీరత్వాన్ని పెంపొందించేలా పెంచింది. ధీరత్వాన్ని నూరిపోసింది. ధైర్యాన్ని నింపింది. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసింది. అదే శివాజీ మహారాజ్ కు గుండెల నిండా స్థైర్యం అయింది. అందుకే ఎంతోమంది శత్రువులను శివాజీ మహారాజ్ గడగడలాడించాడు. మరాఠా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందాడు. తన సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించాడు. సనాతన ధర్మాన్ని రక్షించాడు. నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అందువల్లే సంవత్సరాలు గడిచినా శివాజీ మహారాజ్ ను నేటికీ స్మరించుకుంటున్నాం. అతడు చేసిన త్యాగాలను గుర్తుంచుకుంటున్నాం. శివాజీ మహారాజ్ ఛత్రపతి అని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఏముంది? ప్రతి తల్లి తన పిల్లలను శివాజీ మహారాజు లాగా పెంచితే దేశం అని రంగాలలో అభివృద్ధి చెందుతుందని” గరికపాటి నరసింహారావు తన ప్రవచనంలో చెప్పారు. అన్నట్టు ఈ వీడియోను ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కొంతమంది నెటిజన్లు ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.