https://oktelugu.com/

Chatrapathi : ఛత్రపతి (హిందీ) టీజర్ రివ్యూ : నో వర్డ్స్ ఓన్లీ యాక్షన్… డబుల్ ఇంపాక్ట్ గ్యారంటీ!

Chatrapathi Hindi Review : తెలుగు హిట్ మూవీని ఓ టాలీవుడ్ హీరో హిందీలో రీమేక్ చేయాలనుకోవడం ఊహించని పరిణామం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సాహసానికి పూనుకున్నాడు. చెప్పాలంటే ఇది నేల విడిచి సాము చేయడం. దాదాపు రెండు దశాబ్దాల నాటి కథను ఇప్పుడు చెప్పి సక్సెస్ కావాలనుకుంటున్నారు. అది కూడా నార్త్ ఇండియాలో. 2005లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ కొట్టింది. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ […]

Written By: , Updated On : March 30, 2023 / 04:50 PM IST
Follow us on

Chatrapathi Hindi Review : తెలుగు హిట్ మూవీని ఓ టాలీవుడ్ హీరో హిందీలో రీమేక్ చేయాలనుకోవడం ఊహించని పరిణామం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సాహసానికి పూనుకున్నాడు. చెప్పాలంటే ఇది నేల విడిచి సాము చేయడం. దాదాపు రెండు దశాబ్దాల నాటి కథను ఇప్పుడు చెప్పి సక్సెస్ కావాలనుకుంటున్నారు. అది కూడా నార్త్ ఇండియాలో. 2005లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ కొట్టింది. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఛత్రపతి. ఈ మూవీతో ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది.

ఛత్రపతి మూవీ తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతుందని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నమ్మారు. మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ ని ఎంచుకున్నారు. వీరి కాంబోలో హిందీ ఛత్రపతి తెరకెక్కింది. నేడు టీజర్ విడుదల చేశారు. టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. నో వర్డ్స్ ఓన్లీ యాక్షన్ అన్నట్లు సాగింది.

తెలుగు ఛత్రపతిలో ప్రభాస్-సుప్రీత్ రెడ్డి మీద తెరకెక్కిన ఐకానిక్ బీచ్ ఫైట్ ని టీజర్ లో ప్రముఖంగా చూపించారు. ఒరిజినల్ ఛత్రపతికి మించిన వైలెన్స్, యాక్షన్ తో హిందీ ఛత్రపతి వస్తుందని అర్థం అవుతుంది. సాయి శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్ లో విపరీతమైన ఆదరణ దక్కించుకుంటాయి. ఆ విధంగా నార్త్ ఆడియన్స్ కి సాయి శ్రీనివాస్ పరిచయమయ్యాడు. ఈ ఒక్క కారణంతో హిందీ ఛత్రపతి చేయాలని ఫిక్స్ అయ్యారు.

సమ్మర్ కానుకగా మే 12న విడుదల చేస్తున్నారు. నుష్రత్ బరుచా హీరోయిన్ గా నటిస్తుంది. భాగ్యశ్రీ కీలక రోల్ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ బీజీఎమ్ అందిస్తున్నారు. తనీష్ కే బాగ్చి సాంగ్స్ కంపోజ్ చేశారు. ఛత్రపతి మూవీతో నార్త్ ఇండియాలో పాగా వేయాలని చూస్తున్న సాయి శ్రీనివాస్ ఆలోచన ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. తెలుగులో సాయి శ్రీనివాస్ స్ట్రగుల్ అవుతున్నారు. ఆయన గత చిత్రాలు సాక్ష్యం, అల్లుడు అదుర్స్ డిజాస్టర్ అయ్యాయి. జయ జానకి నాయక మాత్రమే పర్లేదు అనిపించుకుంది.