Chandigarh University: బాయ్ ఫ్రెండే కదా అని కాస్త చనువిస్తే ఆ పద్మాష్‌గాడు తన కామబుద్ధి ప్రదర్శించారు. సభ్యసమాజం తలదించుకునే పని చేశాడు. 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ దారుణ ఘటన ప్రతిష్టాత్మక చండీగఢ్ యూనివర్సిటీలో జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులందరూ ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలతో యూనివర్సిటీని రాత్రంతా హోరెత్తించారు. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ పోలీసులు చర్యల చేపట్టారు. ఈ వీడియోలను ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేసిన విద్యార్థిని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. తోటి విద్యార్థినే ఈ వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. విద్యాశాఖ మంత్రి హర్‌జోత్ సింగ్ బైన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

బాయ్‌ఫ్రెండ్‌కు సెండ్..
చండీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లల్లో ఉంటూ చదువుకుంటోన్న విద్యార్థినులు స్నానం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తం 60 మంది విద్యార్థులను స్నానం చేస్తోన్న దృశ్యాలను సెల్ ఫోన్‌తో షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే యూనివర్సిటీ విద్యార్థిని ఒకరు వీటిని షూట్ చేసినట్లు నిర్ధారించారు. ఆ వీడియోలన్నింటినీ ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో నివసిస్తోన్న తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపింది. అతను వాటిని ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశాడు.
అట్టుడికిన యూనివర్సిటీ..
అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో.. ఈ విషయం తెలియడంతో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రంతా క్యాంపస్‌లో బైఠాయించారు. విద్యార్థినులు స్నానం చేస్తోన్న దృశ్యాలను చిత్రీకరించిన విద్యార్థిని కూడా ఏమీ తెలియనట్లుగా ఈ ఆందోళనలో పాల్గొంది.
ఇంటిదొంగ పనే..
మహిళల క్యాంపస్‌లోకి ఎవరొచ్చారు.. అమ్మాయిలు స్నానం చేస్తుండగా వీడియో తీసేంత ధైర్యం ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. కానీ బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లేవీ కనిపించలేదు. దీంతో పోలీసులు ఇంటిదొంగల పనే అయి ఉంటుందని అనుమానించారు. వారి అనుమానం నిజమే అయింది. అనుమానిత విద్యార్థినులు, హాస్టల్ అధికారులను పోలీసులు విచారణ చేశారు. ఓ విద్యార్థిని నేరం అంగీకరించింది. తానే సహచరులు స్నానం చేస్తుండగా వీడియో తీశానని, వాటిని సిమ్లాలోని తన స్నేహితుడికి పంపించానని చెప్పింది.

బాధితుల ఆత్మహత్యాయత్నం?
ఈ ఘటన తరువాత నిందితురాలితోపాటు వీడియోలో కనిపించిన కొందరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే వీటిని పోలీసులు ఖండించారు. మెడికల్ రికార్డుల ప్రకారం.. ఎవరూ సూసైడ్ చేసుకోలేదని తెలిపారు. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా వచ్చిన వార్తలను పబ్లిసిటీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యకు యత్నించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదన్నారు. డాక్టర్ల నుంచి నివేదిక అందిన తరువాతే స్పష్టత వస్తుందని మొహాలీ ఎస్‌ఎస్పీ తెలిపారు.
స్పందించిన మహిళా కమిషన్..
ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ౖచైర్‌పర్సన్ స్పందించారు. బాత్‌రూమ్ వీడియోలను షూట్ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ఉదంతాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు ముమ్మరం చేశామని వివరించారు. కేంద్రమంత్రి సోమ్ ప్రకా‹శ్ సైతం ఈ విషయంపై ఆరా తీశారు. దీన్ని దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.