Success And Failure: ఆచార్య చాణక్యుడు మనుషుల ప్రవర్తనపై ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? తదితర విషయాలను ఎంతో వివరంగా సూచించాడు. మనం చేసే పొరపాట్లు ఏంటో? వాటికి తగిన పరిష్కారాలు ఏంటనేదానిపై క్లుప్తంగా తెలియజెప్పాడు. ఆనాడు ఆయన చెప్పిన మార్గాలు నేటికి కూడా అనుసరణీయంగానే ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించేందుకు కావాల్సిన పరిస్థితులను బోధించాడు. మానవ జీవితం సజావుగా సాగాలంే కొన్ని సమయాల్లో ఓడిపోవాలని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన కారణాలు ఇప్పటి పరిస్థితులకు చక్కగా సరిపోతాయి.

ఓటమే విజయానికి నాంది
ఓటమి ఎప్పుడు కూడా విజయానికి నాందిగానే భావించాలి. ఓడిపోయినంత మాత్రాన అపజయం కలిగిందని కుంగిపోకూడదు. మళ్లీ ప్రయత్నించి విజయం అందుకోవాలాలి. ఒకోసారి యుద్ధంలో ఓడిపోవడం మరో యుద్ధంలో విజయం సాధించగలరని చాణక్యుడు చెప్పాడు. ఇది కొంత సంక్లిష్టంగా ఉన్నా ఒప్పుకోక తప్పదు. కొన్ని కావాలంటే కొన్నింటిని వదులుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి చిన్న చిన్న వాటిని వదుకోవాల్సి వస్తుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించాలి.
ఓటమికి భయపడొద్దు
యుద్ధంలో ఒకసారి ఓడిపోయినా ప్రతిసారి ఓటమి వస్తుందని భయపడటం సమంజసం కాదు. అవకాశాలను అనుకూలంగా మలుచుకుని తగిన వనరులు సృష్టించుకోవాలి. ఓటమి భవిష్యత్ కు బాటలు వేస్తుంది. జీవిత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు తగిన వ్యూహాలతో ముందుకెళ్లాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు నచ్చక పోయినా చేయాలి. కొన్ని సమయాల్లో గెలుపు కంటే ఓటమే ఎక్కువ సంతృప్తి ఇస్తుందని చెబుతారు. ఈ నేపథ్యంలో ఓటమి తప్పేమీ కాదని అందరు అంగీకరించేదే.

వ్యాపారాల్లో..
వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటే చతికిల పడకుండా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకోవాలి. చాణక్య నీతి ప్రకారం గెలవడానికి ఓడిపోవడం పునాది లాంటిదే. ఆశాజనకమైన అవకాశాల కోసం దృష్టి మరల్చుకోవాలి. ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకునేందుకు అనువైన పరిస్తితులు కల్పించుకోవాలి. ఇందుకోసమే నిరంతరం ఆలోచించాలి. చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం నడుచుకుంటే మనకు అపజయాలు కలిగినా బాధ పడాల్సిన అవసరం ఉండదు. విజయం సాధించే వరకు విశ్రమించకూడదు.