https://oktelugu.com/

Anasuya Bharadwaj: మూడు రోజులు టైం ఇవ్వవా? అనసూయపై చలాకీ చంటీ హాట్ కామెంట్స్..

Anasuya Bharadwaj: బుల్లితెరపై కామెడీతో ఉర్రూతలూగించిన జబర్దస్త్ షో ఎంతోమంది జీవితాలను మార్చేసింది. ఈ షో కు వచ్చిన వారు ఆర్థికంగా నిలదొక్కకోవడమే కాకుండా మరికొందరు మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే పలు కారణాల వల్ల జబర్దస్త్ నుంచి నటులు ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, గెటప్ శీను లాంటి వాళ్లు షో నుంచి బయటకు వచ్చేశారు. అయితే యాంకర్ అనసూయ కుడా వెళ్లిపోయింది. ఆమె చివరి షో ఈ గురువారం ప్రసారం కానుంది. జబర్దస్త్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2022 / 09:43 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj: బుల్లితెరపై కామెడీతో ఉర్రూతలూగించిన జబర్దస్త్ షో ఎంతోమంది జీవితాలను మార్చేసింది. ఈ షో కు వచ్చిన వారు ఆర్థికంగా నిలదొక్కకోవడమే కాకుండా మరికొందరు మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే పలు కారణాల వల్ల జబర్దస్త్ నుంచి నటులు ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, గెటప్ శీను లాంటి వాళ్లు షో నుంచి బయటకు వచ్చేశారు. అయితే యాంకర్ అనసూయ కుడా వెళ్లిపోయింది. ఆమె చివరి షో ఈ గురువారం ప్రసారం కానుంది. జబర్దస్త్ కు గుడ్ బై చెబుతూ ఆడియన్స్ సపోర్టు ఉండాలని ఆమె కోరుకున్నారు.. ఈ సందర్భంగా అనసూయపై చలాకీ చంటీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో అది వైరల్ అవుతోంది.

    సినిమాల్లో మాత్రమే కనిపించే ఎంటర్టైన్మెంట్ బుల్లితెరపై కూడా చూపించొచ్చని జబర్దస్త్ ద్వారా నిరూపించారు కొందరు నటులు. వీరిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శీను, రాకెట్ రాఘవ, చలాకీ చంటీ, చమ్మక్ చంద్ర తదితరులు టీం లీడర్లుగా ఉండి షో ను రన్ చేశారు. వీరికి నాగబాబు, రోజాలు జడ్జిలుగా ఉండి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అయితే కొన్ని సంవత్సరాల కిందటే నాగబాబు పలు కారణాలతో వెళ్లిపోయారు. ఆయనతో పాటు చమ్మక్ చంద్ర తదతర నటులు కూడా ఇతర చానెళ్లోకి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలోనే మరికొందరు జబర్దస్త్ ను వీడాలని నిర్ణయించుకున్నారు. కానీ వెళ్లలేదు.

    ఇటీవల వరుసగా ప్రముఖ కమెడియన్లంతా షో ను వదిలిపెట్టిపోతున్నారు. సడిగాలి సుధీర్ తో పాటు ఆయన టీం మెంబ్లోని గెటప్ శీను షో నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత హైపర్ ఆది కూడా బయటకు వచ్చేశారు. ఒక కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు జబర్దస్త్ ను వీడిన తురువాత సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లెమాల మేనేజ్మెంట్ తో ఇబ్బందులు ఏర్పడ్డాయని,అందుకే నటులంతా షో ను వీడి వెళ్లిపోతున్నారని అన్నారు. కానీ మాజీ మేనేజర్ ఏడుకొండలు ఈ ఆరోపణలకు చెక్ పెట్టారు. ఒక్కొక్కరుగా షో ను వదిలివెళ్లిపోవడంపై ఆ ఆరోపణలపై చర్చ సాగుతోంది.

    ఇక తాజాగా యాంకర్ అనసూయ కూడా షో నుంచి బయటకు వచ్చింది. ఆమె నటించిన చివరి షో ఈ గురువారం ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో అనసూయ తాను జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ముఖ్యమైన వీడియోలను చూపించారు. అంతేకాకుండా ఇద్దరు పిల్లలను వదిలి యాంకరింగ్ కోసం ఎంతో కష్ట పడ్డారని ఇందులో చెప్పారు. అంతేకాకుండా ఇక వెళ్లొస్తా.. బై బై అంటూ అనసూయ చెప్పడం చూస్తే ఇక ఆమె మరోసారి జబర్దస్త్ లో ఆమె కనిపించే అవకాశం లేదని అర్థమైంది.

    ఈ కార్యక్రుమంలోనే అనసూయ ఎగ్జిట్ పై చలాకీ చంటీ హాట్ కామెంట్స్ చేశారు. ‘జబర్ధస్త్ కోసం నెలలో మూడు రోజులు టైం ఇవ్వవా? మా కోసం కేటాయించవా?’ అంటూ అనసూయను ప్రాథేయపడ్డాడు. ఎంతమంది నటులు వెళ్లినా జబర్దస్త్ ఎటు వెళ్లదన్నారు. కొత్త కొత్త నటులతో జబర్దస్త్ షో ను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. మరోవైపు జడ్జి ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. ఇంతకాలం అనసూయ కనిపించగా.. ఇప్పుడు షో లో లేదనుకోవడం బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. అటు అనసూయ మాత్రం ఏమాత్రం ఏమోషనల్ కాకుండా హ్యాపీగా స్టూడియోను విడిచి వెళ్లింది. ఈ గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..