https://oktelugu.com/

CBSE Schools: మార్కుల్లేవ్.. ర్యాంకుల గోలలూ లేవు.. మొత్తం ఎమోజీలే.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటే?

పుస్తకాలతో కుస్తీ పట్టాలి.. బట్టి బట్టి చదువులు చదవాలి. మార్కులు తెచ్చుకోవాలి. ర్యాంకులు సాధించాలి. అయితే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ వైపు వెళ్ళాలి. అవి రెండూ దొరకకపోతే డిగ్రీ తోనే సరిపెట్టుకోవాలి..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 20, 2024 / 09:43 AM IST

    CBSE Schools

    Follow us on

    CBSE Schools: ఇలానే కదా మన విద్యా వ్యవస్థ సాగుతోంది. అందువల్లే విద్యార్థుల్లో సరైన ప్రమాణాలు లేకుండా పోతున్నాయి. విద్యా వ్యవస్థలో ప్రభుత్వాలు ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది.. పైగా విద్యార్థులు బట్టి బట్టి చదవడం వల్ల ప్రమాణాలు ఉండడం లేదు. ఈ క్రమంలో కేరళలోని సీబీఎస్ఈ పాఠశాలలు సరికొత్త విద్యా విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. కేజీ నుంచి రెండవ తరగతి విద్యార్థులలో సోషల్ స్కిల్స్ పెంచే విధంగా పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ఇందులో చూపించిన ప్రదర్శన ఆధారంగా క్లాప్స్, స్టార్, ట్రోఫీ లాంటి ఎమోజిలను కేటాయిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోందని ఉపాధ్యాయులు అంటున్నారు. వారు అసలే ఒత్తిడికి గురి కావడం లేదని చెబుతున్నారు..

    విద్యా విధానం మారాలి

    ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి ఉంటున్నది. కార్పొరేట్ సంస్థలు ఐఐటి, జేఈఈ అనే టార్గెట్ తో చిన్నప్పటినుంచి విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయి.. దీనివల్ల విద్యార్థులు తమకు తెలియకుండానే బట్టి విధానానికి అలవాటు పడిపోతున్నారు. సోషల్ స్కిల్స్ ను పోలేకపోతున్నారు. ఐఐటీ టార్గెట్ అనే విధంగా విద్యా బోధన చేస్తున్న కార్పొరేట్ స్కూల్స్.. కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ఆ విధానాలను అమలు చేస్తున్నాయి. అంత తప్ప విద్యార్థులను సరిగా పట్టించుకోవడం లేదు. విద్యార్థులపై చదువుల పేరుతో విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం వల్ల వారు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా విషయ పరిజ్ఞానాన్ని కోల్పోయి కేవలం మార్కులు సాధించే యంత్రాలుగానే మిగిలిపోతున్నారు. అయితే పోటీ పరీక్షలో సత్తా చాటలేక వెనుకబడి పోతున్నారు. ఈ ఉదంతాలను గమనించి కేరళలోని సీబీఎస్ ఈ స్కూల్స్ ఎమోజీ విధానానికి శ్రీకారం చుట్టాయి. అయితే ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆ స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. భవిష్యత్తు కాలంలో ఈ విధానాన్ని మరిన్ని స్కూళ్లకు విస్తరిస్తామని యాజమాన్యాలు వివరిస్తున్నాయి. ” ఈ విద్యా విధానం వల్ల విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నారు. ఇది సంతోషకరమైన పరిణామం. ఇలానే మిగతా తరగతులకు కూడా విస్తరిస్తాం. విద్యార్థుల్లో మేధోపరమైన పరిజ్ఞానాన్ని పెంచడానికి మా వంతు ప్రయత్నిస్తాం. ఇలా చేయడంవల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతోంది. వారికి నేర్చుకోవాలని కుతూహలం పెరుగుతోంది. ర్యాంకుల గొడవ లేకపోవడం.. మార్కులతో ఇబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థులు స్వేచ్ఛగా చదవగలుగుతున్నారు. హాయిగా రాయగలుగుతున్నారు. విషయాలపై పరిజ్ఞానం పెంచుకోగలుగుతున్నారు. దానివల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని” సీబీఎస్ఈ స్కూళ్ల యాజమాన్యాలు వివరిస్తున్నాయి. అయితే ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఈ విషయంపై దృష్టి సారించాలని కొంతమంది తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.