https://oktelugu.com/

Jeevitha Rajashekar: టాలీవుడ్‌లో కలకలం.. జీవితరాజశేఖర్‌ లపై కేసు !

Jeevitha Rajashekar: జీవితరాజశేఖర్‌ లపై చెక్‌ బౌన్స్‌ ఆరోపణలు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన ఈ న్యూస్ వెనుక..అసలు విషయంలో వెళ్తే.. జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు.. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసమని తమ దగ్గర అప్పులు తీసుకున్నారనీ… ఇప్పుడు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ వాళ్ళు ఆరోపించారు. అప్పట్లో రాజశేఖర్‌ హీరోగా విడుదలైన గరుడ వేగ సినిమా నిర్మాణానికి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 22, 2022 / 08:23 PM IST
    Follow us on

    Jeevitha Rajashekar: జీవితరాజశేఖర్‌ లపై చెక్‌ బౌన్స్‌ ఆరోపణలు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన ఈ న్యూస్ వెనుక..అసలు విషయంలో వెళ్తే.. జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు.. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసమని తమ దగ్గర అప్పులు తీసుకున్నారనీ… ఇప్పుడు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ వాళ్ళు ఆరోపించారు. అప్పట్లో రాజశేఖర్‌ హీరోగా విడుదలైన గరుడ వేగ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు.

    దాంతో రాజశేఖర్ ఫ్యామిలీనే నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. రాజశేఖర్ ఆస్తులు తాకట్టుపెట్టి తమ దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు తీసుకున్నారని జోస్టర్‌ ఫిలిం సభ్యులు చెప్పారు. అప్పట్లో జీవిత తమ దగ్గరికొచ్చి చాలా ఎమోషనల్‌ అయ్యారనీ.. రాజశేఖర్‌ తండ్రి వరదరాజన్‌ చెప్పడంతో.. ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చామనీ వాళ్ళు చెప్పారు.

    కానీ, ఆ తర్వాత రాజశేఖర్ జీవిత తమ నిజస్వరూపం చూపించారు అని, వాళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మోసానికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయంటున్నారు జోస్టర్ ఫిలిం సర్వీస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ తెలియజేశారు.

    మొత్తానికి హీరో రాజశేఖర్, జీవితలు మోసం చేశారంటూ మీడియా ముందుకు జోస్టర్ ఫిలిం సర్వీసెస్ వారు చెప్పడం కలకలం రేపుతోంది. రాజశేఖర్ ఫ్యామిలీ తమ ఆస్తులు తాకట్టుపెట్టి రూ.26 కోట్లు ఎగురవేశారని జోస్టర్ ఫిలిం సర్వీసెస్ వారు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆస్తులను బినామిలా పేరుతో మార్చుకుని మమ్మల్ని మోసం చేశారనీ చెప్పారు.

     

    Recommended Videos: