Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ హిస్టరీ లో ఇప్పటి వరుకు మగవాళ్లే టైటిల్ గెలుచుకున్నారు కానీ,ఆడవాళ్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు..ఈ సీజన్ లో ఇనాయ టైటిల్ విన్నర్ గా గెలిచి మొట్టమొదటి లేడీ టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు..ఓటింగ్ కూడా ఆమెకి అదే రేంజ్ లో పడింది..కానీ పాపం ఆమె చివరికి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కూడా నిలబడకుండా వెనుతిరిగింది..అలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు..ఆమెకి ఓట్లు రాకుండా ఎలిమినేట్ అయితే అది జనాల తీర్పు అని అనుకోవచ్చు..కానీ ఆమెకి సోషల్ మీడియా లో ఎలాంటి ఫాలోయింగ్ వచ్చిందో మన అందరికి తెలుసు.

వివిధ వెబ్ సైట్స్ ద్వారా ఆమెకి వస్తున్న ఓట్లు ఎంత శాతం అనేది కూడా తెలుసు..అలా మన కళ్ళ ముందు అన్నీ ప్రత్యక్ష్యం గా కనిపిస్తున్నా కూడా ఎలిమినేట్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ షాక్..గెలుపు చివరి అంచులు దాకా వచ్చిన ఇనాయనే టైటిల్ గెలుచుకోలేకపోతే..ఇక భవిష్యత్తులో జరగబొయ్యే సీజన్స్ లో కూడా ఆడవాళ్ళకు టైటిల్ కొట్టే అవకాశం ని బిగ్ బాస్ కలిపిస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి.
బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యే ముందు బిగ్ బాస్ నాన్ స్టాప్ OTT అనే ప్రోగ్రాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జరిగింది..ఈ సీజన్ లో బిందుమాధవి అనే అమ్మాయి టైటిల్ గెలుచుకుంది..కానీ దురదృష్టం కొద్దీ ఆ సీజన్ ని చూసిన ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువ..నేషనల్ టెలివిజన్ ఛానల్ లో గెలిస్తేనే ఒక అమ్మాయికి విలువైన గుర్తింపు లభిస్తుంది..కానీ ఇప్పటి వరుకు అది జరగలేదు..ఈ సీజన్ లో జరిగే అవకాశం ఉన్నా బిగ్ బాస్ జరగనివ్వలేదు.

ఈ వారం ఇనాయ ని అన్యాయం గా ఎలిమినేట్ చెయ్యడం ని చూస్తుంటే గత సీజన్స్ లో కూడా ఇలాగే చేశారా అనే అనుమానం రాక తప్పదు..ఈ సీజన్ లో ఒక్క ఇనాయ ఎలిమినేషన్ మాత్రమే కాదు..చాలా ఎలిమినేషన్స్ అన్యాయంగానే జరిగింది..వాటిల్లో గీతూ ఎలిమినేషన్ కూడా ఒకటి..ఇలా ప్రజల తీర్పు కి పూర్తి వ్యతిరేకంగా నడించింది కాబట్టే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..వచ్చే సీజన్ ని నిర్వహిస్తారా లేదా అనే రేంజ్ ఫ్లాప్ షో గా నిలిచింది బిగ్ బాస్ సీజన్ 6.