Okkadu vs Khushi : ‘ఒక్కడు’ షోస్ ని రద్దు చేసి ‘ఖుషి’ షోస్ ని వేసుకుంటున్న బయ్యర్స్.. పవర్ స్టార్ క్రేజ్ మామూలుగా లేదు

Okkadu vs Khushi : పవన్ కళ్యాణ్ పాత సినిమాలు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు..గోకులం లో సీత , సుస్వాగతం , తొలిప్రేమ , తమ్ముడు , బద్రి , ఖుషి ఇలా ఒక్కటా రెండా, ఆరోజుల్లో ఈ సినిమాలు సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామి అంతా ఇంతా కాదు..అందుకే పవన్ కళ్యాణ్ అలాంటి ఫ్యాన్ బేస్ వచ్చిందని అభిమానులు అంటూ ఉంటారు..ఆయన పాత సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది […]

Written By: NARESH, Updated On : January 8, 2023 4:48 pm
Follow us on

Okkadu vs Khushi : పవన్ కళ్యాణ్ పాత సినిమాలు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు..గోకులం లో సీత , సుస్వాగతం , తొలిప్రేమ , తమ్ముడు , బద్రి , ఖుషి ఇలా ఒక్కటా రెండా, ఆరోజుల్లో ఈ సినిమాలు సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామి అంతా ఇంతా కాదు..అందుకే పవన్ కళ్యాణ్ అలాంటి ఫ్యాన్ బేస్ వచ్చిందని అభిమానులు అంటూ ఉంటారు..ఆయన పాత సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది రీసెంట్ గా విడుదలైన ఖుషి చిత్రం.

22 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టిందో..ఇప్పుడు కూడా రీ రిలీజ్ లో అలాంటి అద్భుతాలే సృష్టించింది..విడుదలై పది రోజులు అయ్యింది..ఈ 10 రోజులకు గానూ సినిమా సుమారుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇప్పటి వరకు విడుదలైన అన్నీ రీ రిలీజ్ సినిమాలలో ఇదే హైయెస్ట్.

అయితే ఈ సినిమా సృష్టించిన రికార్డుని మహేష్ బాబు ‘ఒక్కడు’ చిత్రం బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు..నిన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..కానీ విడుదలకి ముందు ఈ సినిమా గురించి అనుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయి..మొదటి రోజు ఈ చిత్రానికి కనీస స్థాయి వసూళ్లు కూడా రాలేదు..కొన్ని చోట్ల అయితే జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేసి ఈ సినిమా స్థానం లో ఖుషి సినిమాని ప్రదర్శిస్తున్నారు..ఖుషి కి ఇప్పటికీ కూడా హౌస్ ఫుల్స్ వస్తూనే ఉన్నాయి..ఖుషి చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నాలుగు కోట్ల 30 లక్షల గ్రాస్ వసూలు చేస్తే ఒక్కడు చిత్రం అందులో సగం కూడా వసూలు చెయ్యలేదు.

దీనితో మహేష్ రేంజ్ బాగా పడిపోయిందా.., లేదా ఒక్కడు మూవీ రేంజ్ ఇంతేనా అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి..ముఖ్యంగా నైజాం మరియు సీడెడ్ బ్యాక్ డ్రాప్ ని మిక్స్ చేసిన ఈ సినిమాకి ఆ రెండు ప్రాంతాలలో చిల్లరే వచ్చింది..ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం,