Myanmar: కొత్తగా విమాన ప్రయాణం చేసేవారికి అదో మధురానుభూతి. విమానం రన్ వే నుంచి స్టార్ అయి గగనతంలోకి వెళ్లిన తరువాత వారికి ప్రపంచమే ఒక కుగ్రామంలా కనిపిస్తుంది. అదే సమయంలో ఏదో తెలియని ఆందోళన కూడా వెంటాడుతుంది. సాంకేతిక సమస్యలు, హైజాక్ లు వంటి ఆలోచనలతో చాలామంది భయం మాటునే ప్రయాణాలు చేస్తుంటారు. విమానం రన్ వే నుంచి బయలుదేరిన నాటి నుంచి కంగారు పడుతుంటారు. లేనిపోని దురాలోచనలతో గడుపుతుంటారు. సినిమాల మాదిరిగా దృశ్యాలు ఎదురవుతాయేమోనని భయపడుతుంటారు. క్షేమంగా ల్యాండ్ అయితేనే ఊపిరిపీల్చుకుంటారు.అటువంటిది విమానం గాల్లో ఉన్నప్పుడు భూమి నుంచి బుల్లెట్ దూసుకొస్తే ఎంతలా భయమేస్తుందో చెప్పనక్కర్లేదు. మయూన్మార్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న వారికి ఇటువంటి ఘటనే ఎదురైంది.

మయూన్మార్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ పై భూమి నుంచి ఒక బుల్లెట్ దూసుకొచ్చి గాయపరచింది. లొయికా నుంచి వందలాది మంది ప్రయాణికులతో విమానం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది. సరిగ్గా విమానాశ్రయానికి తూర్పున నాలుగు మైళ్ల దూరంలో 3500 అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా భూమి నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ ఓ ప్యాసింజర్ ను గాయపరచింది. విమానంలో కీలక విభాగమైన ఫ్యూజ్ లెజ్ నుంచి తూట దూసుకురావడం భయంగొల్పుతోంది. ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వారికి నోటి మాట రాలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. అయితే ఒకే బుల్లెట్ తో దాడి నిలిచింది. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే అనుకొని ఘటనతో షాక్ కు గురైన విమాన సిబ్బంది మయున్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్ కార్యాలయానికి సమాచారమిచ్చారు. దీంతో దేశంలోని అన్ని విమాన సర్వీసులను రద్దుచేశారు. తిరిగి లొయికా ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే క్షతగాత్రుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కయాలోని రెబల్ దళాలే ఈ దుశ్యర్యకు పాల్పడ్డాయని మయూన్మార్ మిలటరీ గవర్నమెంట్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని రెబల్స్ ప్రకటించారు. ప్రభుత్వంతో పోరాడుతున్న మైనార్టీ మిలీషియా గ్రూప్ కరెన్సీ నేషనల్ ప్రొగ్రసివ్ పార్టీ ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడ్డారని మయూన్మార్ మిలటరీ ప్రభుత్వ అధికారి మేజర్ జనరల్ మిన్ టున్ తెలిపారు. అయితే విమానాలపై దాడి యుద్ధ నేరాల కిందకు వస్తుందని మయూన్మార్ ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి ఘటనలను ప్రపంచ శాంతి సంస్థలు ముక్త కంఠంతో ఖండించాలని కూడా విన్నివించాయి. అయితే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇది యుద్ధ నేరాల కిందకు వస్తోందని.. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలకు ఉపక్రమించాలని వివిధ దేశాధినేతలు సూచించారు.