Homeఅంతర్జాతీయంUkraine Russia War: ఉక్రెయిన్ కు ‘బ్రిటన్’ అణుతూటాలు.. రష్యా హెచ్చరిక మరో యుద్ధం తప్పదా?

Ukraine Russia War: ఉక్రెయిన్ కు ‘బ్రిటన్’ అణుతూటాలు.. రష్యా హెచ్చరిక మరో యుద్ధం తప్పదా?

Ukraine Russia War
Ukraine Russia War

Ukraine Russia War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది. ఈ రెండు దేశాలను ఎగ దోస్తూ.. మిగతా దేశాలు తెర వెనక తమ పంతాన్ని నెగ్గించుకుంటున్నాయి.. అంతేకాదు ఆర్థికంగా లాభపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఇప్పటిదాకా బాంబులు, యుద్ధ విమానాల ద్వారా మాత్రమే వార్ జరిగింది. ఇకనుంచి రేడియో ధార్మిక ఆయుధాల వినియోగానికి ఇరుదేశాలు సిద్ధమైపోయాయని తెలుస్తోంది. విక్రమంలో రష్యా ఇసికందర్ అణుక్షిపణులను బెలారస్ తరలించిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బ్రిటన్ డిప్లేటెడ్ యురేనియంతో చేసిన తూటాలను ఉక్రెయిన్ కు సరఫరా చేసేందుకు సిద్ధమైపోయింది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిటన్ పై నిప్పులు చెరిగారు. ఒకవేళ బ్రిటన్ గనుక ఈ ఆయుధాలు ఉక్రెయిన్ దేశానికి అందిస్తే, తాము తమదైన శైలిలో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆయుధాలు వాడితే రేడియోధార్మికత 100 కిలోమీటర్ల వరకు ఉంటుందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆయుధాల విస్ఫోటనం వల్ల గాలి, నీరు, నేల, వాతావరణం కలుషితం అయిపోయి కొన్ని తరాల వరకు ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తారని హెచ్చరిస్తున్నారు.

డిప్లేటెడ్ యురేనియం అంటే ఏమిటి?

అణ్వాయుధాలు తయారు చేసేందుకు యురేనియం వాడతారు. ఇది ” యూ 238″ రూపంలో ఉంటుంది. దీనిలో 0.72 శాతం మాత్రమే యూ _235 యురేనియం ఉంటుంది. దీనిని మాత్రమే అణ్వాయుధాలలో వాడుతారు.. ముడి యురేనియాన్ని శుద్ధి చేసి దీనిని వెలికి తీస్తారు. ఇది అణు విచ్చిత్తిని సృష్టించలేదు. కానీ, దళసరిగా ఉంటుంది. సాధారణంగా లడ్డు వంటి లోహాల కంటే బలంగా ఉంటుంది. దీంతో ప్రొజెక్టైల్స్ లేదా భారీ తూటాలు తయారు చేసేందుకు చాలా అనువైంది. డిప్లేటెడ్ యురేనియం అమర్చిన తూటాను కనుక పేల్చితే అది ఒక బలమైన ఆయుధం లాగా పనిచేస్తుంది. యుద్ధ ట్యాంకులకు అమర్చిన బలమైన లోహాలను కూడా చీల్చుకొని వెళ్ళగలుగుతుంది. అమెరికా 1970 నుంచి వీటితో కవచ చేదక తూటాలను తయారు చేయడం ప్రారంభించింది. కేవలం ఇవే కాకుండా ట్యాంక్ కవచాలు తయారు చేసే మిశ్రమాల్లో కూడా దీనిని వాడుతోంది. ట్యాంక్ కిల్లర్ గా పిలిచే ఏ_10 విమానాల తయారీలోనూ వాడుతోంది. అమెరికా ఇప్పటికీ ఈ రకం యురేనియంతో ఆయుధాలను తయారు చేస్తోంది. వీటిల్లో ఎం1ఏ2 అబ్రామ్స్ ట్యాంకులు వాడే ఎం829ఏ4 తూటాలు చాలా కీలకమైనవి.

Ukraine Russia War
Ukraine Russia War

2003లో ఇరాక్ పై అమెరికా చేపట్టిన యుద్ధంలో దాదాపు పదివేల రౌండ్ల డిప్లేటెడ్ యురేనియం తూటాలను వాడింది. ప్రజలు నివసించే పలు ప్రాంతాల వద్ద ఈ తూటాలు వాడినట్టు తెలుస్తోంది. బస్రా, సమవహ, నస్రియా, ఫలుజా వద్ద వీటిని భారీగా ప్రయోగించింది. ఈ తూటాలను కేవలం కవచ వాహనాలపైనే వాడాలని అమెరికా ఎయిర్ ఫోర్స్ 1975లో ఇచ్చిన సలహాకు ఇది పూర్తి వ్యతిరేకం. ఇరాక్ లోని 300 ప్రదేశాల్లో ఈ తూటాల అవశేషాలు గుర్తించారు. వీటిని శుభ్రం చేసేందుకు మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతాయని అప్పట్లో అంచనా వేశారు.. ఇక ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో వీటి ప్రస్తావన వస్తున్న నేపథ్యంలో.. నష్టం తీవ్రత ఈ విధంగా ఉంటుందో అంచనా వేయలేమని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఇదే కనక జరిగితే ప్రాణ నష్టం అపారంగా ఉంటుందని, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version