Homeట్రెండింగ్ న్యూస్Bald Groom: పెళ్లి జరుగుతుండగానే ఊడిపోయిన వరుడి విగ్గు.. షాకిచ్చిన వధువు

Bald Groom: పెళ్లి జరుగుతుండగానే ఊడిపోయిన వరుడి విగ్గు.. షాకిచ్చిన వధువు

Bald Groom: వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు. అటువంటిది ఒక అబద్ధం ఆడిన పాపానికి పెళ్లి పెటాకులైంది. బట్టతలను దాచి పెళ్లికి సిద్ధమైన వరుడిని పెళ్లి పీటలపై తిరస్కరించింది ఓ యువతి. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఇటీవల వెలుగు చూసింది ఈ ఘటన. సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన యువతీ యువకులకు పెళ్లి నిశ్చయమైంది. మంచి సంబంధాలు దొరకడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి నిర్ణయించుకున్నాయి. కానీ వరుడికి బట్టతల ఉందని ఆయన కుటుంబీకులు చెప్పలేదు. పెళ్లి చూపుల్లో దీనిని దాచిపెట్టారు. చిన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. విగ్గుతో బట్టతలను దాచిపెట్టే ప్రయత్నం చేశారు. పెళ్లి వరకూ బాగానే మేనేజ్ చేశాడు.

Bald Groom
Bald Groom

అయితే వివాహ వేడుకల్లో భాగంగా జయమాల వేడుకలు నిర్వహించారు. అంతటా సందడిగా కార్యక్రమం జరుగుతున్న సమయంలో వరుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని లేపే ప్రయత్నంలో తలపాగా తీయగా విగ్గు ఊడిపోయింది. ఇది చూసి వధువు, ఆమె బంధువులు నిర్ఘాంతపోయారు.బట్టతల విషయం దాచారంటూ వరుడి కుటుంబంపై వధువు కుటుంబసభ్యులు రుసరుసలాడారు. తమను మోసం చేశారంటూ వాగ్వాదానికి దిగారు. అయితే పెళ్లికి వచ్చిన వారు, పెద్దలు సముదాయించినా వారు వినలేదు. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునే సమస్యే లేదని వధువు కుండబద్దలు కొట్టేసింది.

Also Read: KCR- National Politics: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తారా?

అంతటితో ఆగకుండా తమను మోసం చేశారంటూ వరుడి కుటుంబసభ్యులపై ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పరువుకు నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వదువు తరుపు బంధువులు, కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. . అయితే పెళ్లి కోసం ఇప్పటి వరకు 5.66 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని వధువు తండ్రి తెలుపగా.. ఆ మొత్తం ఇచ్చేందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. దీంతో వివాదం సద్దుమణిగింది. ఎంతో సందడిగా పెళ్లి మండపానికి వచ్చిన వరుడు.. చివరకు వదువు లేకుండానే అక్కడ నుంచి వెళ్లిపోవడంతో బంధువులు విస్తుపోయారు.

Bald Groom
Bald Groom

సాధారణంగా వివాహమన్నాక చిన్న చిన్న అబద్ధాలతో సంబంధాలు కలుపుకోవడం సహజమే.పెళ్లిల్ల కోసం ఆడుతున్న అబద్ధాలు ఎన్నో చెప్పలేం కానీ, చిన్నవో పెద్దవో ప్రతి పెళ్లిలో అబద్ధాలనేవి సాధారణం జరుగుతుంటాయి.. వధూవరుల కుటుంబాలు చాలావరకూ సర్దుకుపోతుంటాయి. కానీ వరుడికి ఏకంగా బట్టతల ఉండడంతో వదువుతో పాటు ఆమె కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. . పెళ్లి తంతు జరుగుతుండగా అసలు విషయం బయటపడడంతో అవమానంగా భావించారు. ఏకంగా అతడితో వివాహమే వద్దనుకున్నారు. అయితే మొత్తం వ్యవహారంలో జరిగిన హంగామా అంతా మాత్రం అంతా ఇంతా కాదు. ఇది అంతటా చర్చనీయాంశం కాగా.. సోషల్ మీడియాలో సైతం ఈ ద్రుశ్యాలు తెగ వైరల్ అయ్యాయి.

Also Read:KCR Returned From Delhi: మోడీ దెబ్బకు కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్.. అసలు కారణమిదే?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular