https://oktelugu.com/

Anchor Suma Arrest : బ్రేకింగ్: స్టార్ యాంకర్ సుమ అరెస్ట్!

Suma arrested : స్టార్ యాంకర్ సుమ అరెస్ట్ అయ్యారు. సంకెళ్లు వేసి ఆమెను తీసుకెళుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సుమ నిజంగా అరెస్ట్ కాలేదు. ఇది ఓ సినిమా ప్రమోషన్. హీరో అల్లరి నరేష్ కోసం సుమ కనకాల అరెస్ట్ అయ్యారు. అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం. ఈ మూవీలో ఆయన సీరియస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. కామెడీ హీరో ఇమేజ్ ఉన్న అల్లరి నరేష్ పంథా మార్చారు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 12, 2023 / 04:37 PM IST
    Follow us on

    Suma arrested : స్టార్ యాంకర్ సుమ అరెస్ట్ అయ్యారు. సంకెళ్లు వేసి ఆమెను తీసుకెళుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సుమ నిజంగా అరెస్ట్ కాలేదు. ఇది ఓ సినిమా ప్రమోషన్. హీరో అల్లరి నరేష్ కోసం సుమ కనకాల అరెస్ట్ అయ్యారు. అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం. ఈ మూవీలో ఆయన సీరియస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. కామెడీ హీరో ఇమేజ్ ఉన్న అల్లరి నరేష్ పంథా మార్చారు. ఈ మధ్య వరుసగా సోషల్ సబ్జెక్ట్స్ లో నటిస్తున్నారు.

    నాంది, ఇట్లు నేరేడుమిల్లి నియోజకవర్గం సీరియస్ సోషల్ టాపిక్స్ తో తెరకెక్కిన చిత్రాలు. నాంది హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో అల్లరి నరేష్ అన్యాయంగా జైలు శిక్ష అనుభవించే ఖైదీగా నటించారు. ఆ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడలతో ఉగ్రం మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి ప్రచారం కల్పించడం కోసం అల్లరి నరేష్ ఓ ప్రమోషనల్ స్టంట్ ప్లే చేశాడు. యాంకర్ సుమను అరెస్ట్ చేసినట్లు… ఓ ఫోటో విడుదల చేశారు.

    సుమ సంకెళ్ళతో బంధించబడి ఉన్న పిక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కొందరు ఇది నిజమే అని భ్రమ పడుతున్నారు. కాగా సుమ ఇటీవల నటనకు గుడ్ బై చెప్పేశారు. ఆమె నేరుగా చెప్పుకున్నా హింట్ ఇచ్చారు. ఓ కాలేజ్ ఫెస్ట్ కి హాజరైన సుమ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా… నటన మనకు కలిసి రావడం లేదు. అది వద్దులే అని సమాధానం చెప్పారు. నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం అన్నారు. గత ఏడాది సుమ జయమ్మ పంచాయితీ టైటిల్ తో మూవీ చేశారు.

    కాగా యాంకర్ గా కూడా ఆమె జోరు తగ్గింది. శ్రీముఖి, రష్మీ గౌతమ్ వంటి గ్లామరస్ యాంకర్స్ పరిశ్రమను ఏలేస్తున్నారు. వయసు పెరిగిన నేపథ్యంలో ఆమె కూడా ఆసక్తి తగ్గించారు. లిమిటెడ్ గా షోలు చేస్తున్నారు. ఇటీవల సుమ అడ్డా టైటిల్ తో టాక్ షో స్టార్ట్ చేశారు. ఇది ఏమంత ఆదరణ దక్కించుకున్న దాఖలాలు లేవు.