
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో పాన్ ఇండియన్ లెవెల్ లో భారీ బడ్జెట్ తో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి మనకి తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది,పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదలై మూవీ పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో దున్నేస్తాడు అనే నమ్మకాన్ని అభిమానుల్లో నింపింది ఈ చిత్రం.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు.ఇది ఇలా ఉండగా ‘హరి హర వీరమల్లు’ గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది..అదేంటో ఇప్పుడు చూద్దాము.
‘హరి హర వీరమల్లు’ సినిమా కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ ని కూడా ఒక రేంజ్ లో ఊపేస్తాదని మూవీ టీం చాలా నమ్మకం తో ఉంది..కథ అలాంటిది అట..అయితే బాలీవుడ్ లో ఈ సినిమా కి సంబంధించి ప్రొమోషన్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో చేయబోతున్నారట..ముఖ్యంగా మూవీ మొట్టమొదటి స్క్రీనింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ని ప్రత్యేకంగా వెయ్యబోతున్నారట.పవన్ కళ్యాణ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే.

సినిమా విడుదలకు దగ్గర పడే సమయం లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ని కలిసి ఈ సినిమా ప్రీమియర్ కి ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది.ఒకవేళ వాళ్లిద్దరూ ఒప్పుకొని ఈ సినిమా ప్రీమియర్ ని వీక్షించి ,సినిమా గురించి నాలుగు నిముషాలు మాట్లాడితే బాలీవుడ్ సైడ్ ఆడియన్స్ కి వేరే లెవెల్ లో రీచ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.