https://oktelugu.com/

Pawan Kalyan – Sujeeth #OG movie : బ్రేకింగ్ : 30 వ తేదీన పవన్ కళ్యాణ్ – సుజీత్ #OG మూవీ ప్రారంభం

Pawan Kalyan – Sujeeth #OG movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి #OG..రన్ రాజా రన్ మరియు సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.. పవన్ కళ్యాణ్ కి సుజీత్ ఎంత పెద్ద వీరాభిమాని అనేది అందరికీ తెలిసిందే.. గబ్బర్ సింగ్ సినిమా మొదటి రోజు షో చూసి బయటకి వచ్చి ‘జిందాబాద్ పవర్ స్టార్’ అంటూ సుజిత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 27, 2023 / 01:25 PM IST
    Follow us on

    Pawan Kalyan – Sujeeth #OG movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి #OG..రన్ రాజా రన్ మరియు సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.. పవన్ కళ్యాణ్ కి సుజీత్ ఎంత పెద్ద వీరాభిమాని అనేది అందరికీ తెలిసిందే.. గబ్బర్ సింగ్ సినిమా మొదటి రోజు షో చూసి బయటకి వచ్చి ‘జిందాబాద్ పవర్ స్టార్’ అంటూ సుజిత్ అరిచిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

    అలా అభిమాని స్థాయి నుండి నేడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే రేంజ్ కి ఎదిగాడంటే సుజిత్ కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది.. సెలబ్రిటీస్ సైతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయ్యినందుకు సుజీత్ కి శుభాకాంక్షలు తెలియచేసారు.. అందులో ప్రభాస్ , రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

    అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు పండుగ లాంటి వార్త.. ఈనెల 30వ తారీఖున ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, విలన్ ఎవరు అనేది కూడా ఆరోజే ప్రకటించబోతుంది మూవీ టీం.

    పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ సుజీత్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే అభిమానుల మతులు పోగొట్టేలా చేసిన సుజిత్ సినిమా కూడా అదే రేంజ్ లో తీసి పవన్ కళ్యాణ్ పై తనకి ఉన్న పిచ్చి అభిమానాన్ని చాటుకోవాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. చూడాలి మరి ఈ వీరాభిమాని పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడో అనేది.