
Pawan Kalyan-Ajith: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో హీరోలను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారో మన అందరికీ తెలిసిందే.అభిమానులు వారిని హీరోలుగా చూడడం మానేసి సొంత కుటుంబ సభ్యులు లాగ చూస్తుంటారు.కొంతమంది హీరోలను అయితే దేవుళ్ళు లాగ చూస్తారు, అలా సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు తలా అజిత్.
ఈ ఇద్దరు హీరోల సినిమాలు వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర వాతావరణం ని తలపిస్తుంది.అభిమానులు వీళ్ళని ఒక ఆరాధ్య దైవం లాగ కొలుస్తారు.సినిమా బాగున్నా బాగాలేకపోయిన , హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓపెనింగ్ రికార్డ్స్ బద్దలు అవ్వాల్సిందే..అదృష్టం బాగుండి టాక్ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో కూడా ఒక్క రికార్డు మిగలదు.అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానుల కోరిక.
ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుందని ఒక ప్రముఖ కోలీవుడ్ మీడియా ఛానల్ నేడు ఒక కథనం ప్రచురించింది.సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన ఒక దర్శకుడు ఇటీవలే అజిత్ ని కలిసి ఈ మల్టీస్టార్ర్ర్ మూవీ స్టోరీ ని వినిపించగా , అజిత్ కి ఎంతగానో నచ్చిందని, మరో హీరో గా ఎవరిని అనుకుంటున్నారు అని ఆ డైరెక్టర్ ని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పాడని, అది వినగానే అజిత్ ఎంతో సంతోషించాడని కోలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

గతం లో కూడా పవన్ కళ్యాణ్ ని విలేకరులు మీకు అజిత్ కి కలిపి సోషల్ మీడియా లో మ్యూచువల్ ఫ్యాన్ బేస్ చాలా ఉంది, మీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ఆశించవచ్చా అని అడగగా పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్తూ ‘మంచి కథ తో ఎవరైనా నా దగ్గరకి వస్తే కచ్చితంగా చేస్తాను’ అని బదులిచ్చాడు..అలా ఇద్దరి సైడ్ నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడం తో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం మరింత తేలిక అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియబోతుంది.