Most Searched Movies On Google: 2022 దాదాపు ముగిసింది. కొన్ని రోజుల్లో 2023 ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అరుదైన విషయాలు గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. కొన్ని చిత్రాలు సంచలనాలు నమోదు చేశాయి. ముఖ్యంగా సౌత్ ఇండియా చిత్రాలు చరిత్ర సృష్టించాయి. అదే సమయంలో నార్త్ మూవీస్ ఘోరపరాజయం చవిచూశాయి. ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2, విక్రమ్, కాంతార, పొన్నియిన్ సెల్వన్ వందల కోట్ల వసూళ్లు సాధించాయి.

ఈ ఏడాది బాలీవుడ్ కి అసలు కలిసి రాలేదు. ఒకటి రెండు చిత్రాలు మినహాయిస్తే వరుస డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అసలు థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం లేదనే అభిప్రాయానికి మేకర్స్ వచ్చారు. కొద్దోగొప్పో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా కనీస వసూళ్లు సాధించలేకపోయాయి. అమీర్ ఖాన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా లాల్ సింగ్ చడ్డా నిలిచిపోయింది. స్క్రిప్ట్ సెలక్షన్ లో మేటి అని నిరూపించుకున్న అమీర్ ఖాన్ కి లాల్ సింగ్ చడ్డా ఫలితం పెద్ద గుణపాఠం.
ఇక కరణ్ జోహార్ నిర్మించిన బ్రహ్మాస్త్ర కొంతలో కొంత పర్లేదు అనిపించింది. అయితే బడ్జెట్ రీత్యా బ్రహ్మాస్త్ర పూర్తి స్థాయిలో రికవరీ కాలేదనే వాదన ఉంది. 2022 సంచలన చిత్రంగా ది కాశ్మీర్ ఫైల్స్ నిలిచింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కాంట్రవర్షియల్ మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ దశాబ్దానికే సంచలన చిత్రంగా కాంతార నిలిచింది. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన కాంతార రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 20 రెట్లకు పైగా వసూలు చేసినట్లు లెక్క.
అంటే రూ. 100 కోట్ల బడ్జెట్ మూవీ రూ. 2000 కోట్ల వసూళ్లు సాధించిన దాంతో సమానం అది. కాంతార వసూళ్ళ పరంగా భారత చలన చిత్ర చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మించి కెజిఎఫ్ 2 వసూళ్లు రాబట్టడం మరొక చెప్పుకోదగ్గ పరిమాణం. ఈ ఏడాది కన్నడ పరిశ్రమ దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను ఆకర్షించింది. కాగా హైప్ నెలకొన్న చిత్రాల గురించి సినీ జనాలు గూగుల్ లో సెర్చ్ చేయడం జరిగింది. జాతీయంగా, అంతర్జాతీయంగా గూగుల్ లో ఏ చిత్రాల కోసం ఆడియన్స్ అధికంగా సెర్చ్ చేశారో చూద్దాం…

ఇండియా వైడ్ సినిమా లవర్స్ బ్రహ్మాస్త్ర గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. తర్వాత కెజిఎఫ్ 2 కోసం పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్, ఆర్ ఆర్ ఆర్, కాంతార చిత్రాల గురించి ఎక్కువగా జనాలు తెలుసుకోవాలి అనుకున్నారు. అవి టాప్ ఫైవ్ లో నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే.. బ్రహ్మాస్త్ర, కెజిఎఫ్ 2 చిత్రాలకు మాత్రమే చోటు దక్కింది. ఆర్ ఆర్ ఆర్ టాప్ టెన్ లో లేకపోవడం ఊహించని పరిమాణం.
ఇండియా వైడ్ సినిమా లవర్స్ అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాల జాబితా…
1. బ్రహ్మాస్త్ర
2.కేజీయఫ్ -2
3.ది కశ్మీర్ ఫైల్స్
4.ఆర్‌ఆర్‌ఆర్
5.కాంతార
6.పుష్ప : ది రైజ్
7.విక్రమ్
8.లాల్ సింగ్ చడ్డా
9.దృశ్యం 2
10.థార్ – లవ్ అండ్ థండర్
వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలు
1. థార్ – లవ్ అండ్ థండర్
2.బ్లాక్ ఆడమ్
3.టాప్ గన్
4.ది బ్యాట్‌మ్యాన్
5.ఎన్కాంటో
6.బ్రహ్మాస్త్ర
7.జురాసిక్ వరల్డ్
8.కేజీయఫ్-2
9.అన్‌చార్టడ్
10.మోర్బియస్