Brahmastra Advance Booking Report: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభజనలకు కేంద్ర బిందువుగా మారిన చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ #RRR..విడుదలకు ముందు ఈ సినిమా ప్రేక్షకుల్లో ఏర్పాటు చేసిన అంచనాలను అందుకోవడం లో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యింది..దాని ఫలితమే విడుదలైన ప్రతి ప్రాంతీయ భాషలో సంచలన విజయం సాధించి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి ఆల్ టైం టాప్ 3 ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది..ఇక ఆ తర్వాత విజయం సాధించిన సినిమాలలో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉండగా..బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం దారుణంగా పడిపోయింది..ఇటీవలే విడుదలైన ఖాన్స్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో బాలీవుడ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు..అలా అనుకుంటున్న సమయం లో బాలీవుడ్ ఇండస్ట్రీ కి కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర..బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని సుమారు రెండు వందల కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

టీజర్ దగ్గర నుండి మొన్న విడుదలైన ట్రైలర్ వరుకు ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడం తో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ లెవెల్ లో జరుగుతున్నాయి..కేవలం హిందీ లో మాత్రమే కాదు తెలుగు లో కూడా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగ జరుగుతున్నాయి..మన టాలీవుడ్ లో ఒక హిందీ సినిమాకి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం చూసి చాలా కాలమే అయ్యింది..ప్రస్తుతం నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూస్తుంటే ఈ సినిమాకి కేవలం హిందీ వెర్షన్ నుండే మొదటి రోజు 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత హిందీ లో మొదటి రోజు 30 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టిన బాలీవుడ్ సినిమానే లేకపోవడం గమనార్హం.
Also Read: Renu Desai Second Marriage: రెండవ పెళ్లి పై రేణు దేశాయ్ సెన్సషనల్ కామెంట్స్..వైరల్ అవుతున్న పోస్ట్

అక్షయ్ కుమార్ హీరో గా నటించిన సూర్య వంశి అనే సినిమా పాతిక కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది..ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క బాలీవుడ్ సినిమా కూడా కనీసం 20 కోట్ల రూపాయిల ఓపెనింగ్ వసూళ్లను కూడా దక్కించుకోలేకపోయింది..మన సౌత్ నుండి బాలీవుడ్ కి దబ్ అయినా #RRR సినిమా హిందీ లో మొదటి రోజు 18 కోట్ల రూపాయిలు మరియు KGF చాప్టర్ 2 సినిమా ఏకంగా 52 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాయి..ఆ సినిమాల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ వసూళ్లను దక్కించుకోబోతున్న చిత్రం బ్రహ్మస్త్ర మాత్రమేనని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..బాలీవుడ్ లో #RRR చిత్రం దాదాపుగా 300 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమాకి సరైన టాక్ వస్తే #RRR ఫుల్ రన్ ని దాటేసి 400 కోట్ల రూపాయిలు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు..మరి వారి అంచనాలను ఈ సినిమా ఎంత వరుకు అందుకుంటుందో తెలియాలంటే ఈ నెల 9 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.
[…] […]