Viral Video (1)
Viral Video: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఈ కథనంలో మేము ప్రస్తావించిన వీడియో నవ్వు తెప్పిస్తోంది.. అదే సమయంలో ఆలోచింపజేస్తోంది. అయితే ఇందులో ఓ బాలుడు చూపించిన పోరాటపటిమ ఆకట్టుకుంటున్నది. లక్ష్యాన్ని సాధించాలి అనే అతని ప్రయత్నం ఆలోచింపజేస్తున్నది. అతని వయసు మహా అయితే 12 సంవత్సరాలలోపు ఉంటుంది. కానీ అతను మాత్రం అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు.. వారెవా అనిపించాడు. చూసేవాళ్ళు శభాష్ అనేలా చేశాడు.
Also Read: మీకో దండం రా బాబూ.. ఇండియన్ క్రికెటర్లను ఇలా చేశారేంట్రా?!
ఆ ప్రాంతం ఎక్కడో తెలియదు.. సమయం మాత్రం రాత్రి 7:00 గంటలు దాటింది. ఓ బాలుడు.. మరో యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు.. ఇద్దరు హోరాహోరీగా తలపడుతున్నారు. ముఖ్యంగా ఆ బాలుడు విరామం అనేది లేకుండా.. విశ్రమించేది లేదని బ్యాట్ తో కాకర్ ను అదే పనిగా కొడుతున్నాడు. ఫోర్ హేండ్.. రిస్ట్ హ్యాండ్.. బ్యాక్ హ్యాండ్ ఇలా అన్ని రకాల షాట్లు ఆడుతున్నాడు. ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా ఆడుతున్నాడు. ప్రత్యర్థి మాత్రం అతడి కొట్టే షాట్లకు సమర్థవంతంగా బదులిస్తున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి ఆ బాలుడు విజయం సాధించాడు. కాకపోతే అతడు విజయం సాధించేందుకు ఎంతో ప్రయత్నం చేశాడు. చెమటోడ్చి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. విజయం సాధించిన తర్వాత అతడు అలాగే కింద పడిపోయాడు.. ఊడిపోయిన లాగును అప్పటికి గాని అతడు సరి చేసుకోలేదు.. అంతేకాదు విజయం సాధించిన తర్వాత అతడు చూపించిన హవ భావాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. వారెవా అనేలా చేస్తున్నాయి.. శభాష్ అని భుజం తట్టేలా ఉన్నాయి.
అనుకున్న లక్ష్యం వైపు..
ఆ బాలుడు మ్యాచ్ ఆడుతున్నంతసేపు హోరాహోరీగా తలపడ్డాడు. అతడు వేసుకున్న నిక్కర్ జారుతున్నప్పటికీ లక్ష్యం వైపే తన మనసును లగ్నం చేశాడు. ఒక చేత్తో జారుతున్న నిక్కర్ ను సరి చేసుకుంటూనే.. మరో చేత్తో బ్యాట్ ను పట్టుకొని కాకర్ ను కొడుతున్నాడు.. నిక్కర్ జారుతున్న దృశ్యాలు నవ్వు తెప్పిస్తున్నప్పటికీ.. ఎవరు ఏమైనా అనుకోని.. లక్ష్యం వైపే నా దృష్టి అనుకుంటూ అతడు ఆడాడు. చెమటలు చిందించాడు. ఒళ్ళును హూనం చేసుకున్నాడు. ప్రత్యర్థి భయపడే షాట్లు కొట్టాడు. వీరోచితంగా పోరాడాడు. చివరికి గెలుపును సాధించాడు.. అతడు ఆడిన ఆట నవ్వు తెప్పించినప్పటికీ.. పోరాట స్ఫూర్తి మాత్రం కొత్తగా అనిపించింది. ఎంతటి కష్టమైనా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లక్ష్యాన్ని వదిలిపెట్టదు. కార్యసిద్ధిని దూరం చేసుకోవద్దు. అనే సందేశాలను మాత్రం ఆ బాలుడు ఇచ్చాడు. ఒకటే జననం.. ఒకటే మరణం.. గెలుపు పొందు వరకు.. అలుపు లేదు మనకు.. అని భద్రాచలం సినిమాలో శ్రీహరి పాడుతుంటాడు కదా.. ఆ పాట ఈ బాలుడికి నూటికి నూరు పాళ్లు కాదు.. కోటి పాళ్లు సరిపోతుంది..
లాగు ఊడి పోనీ.. ప్రపంచం మునిగి పోనీ.. గురి లక్ష్యం పైననే..
లాగు వూడిపోతే మళ్ళీ తొడుక్కోవచ్చు. కానీ ball మిస్ అయితే game ఓడిపోతాము కదా! అందుకే లక్ష్యం లాగు మీద కాదు… ball మీద…
— Vottakay (@siddipet_poradu) March 10, 2025