Boycott OYO: చాలామంది విమర్శించారు. చాలామంది తిట్టారు. అయినప్పటికీ రితేష్ అగర్వాల్ వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు. నిర్ణయం తీసుకొనే ఓయో ను తీసుకొచ్చాడు.. ఒకటా రెండా.. దేశవ్యాప్తంగా ఓయో పెత్తనమే. ఫైవ్ స్టార్ హోటల్ నుంచి మారుమూల లాడ్జి వరకు ప్రతిదాంట్లో ఓయోనే. యాప్ లో బుక్ చేసుకుని.. కావాల్సినంత ప్రైవసీని.. నచ్చిన వ్యక్తితో ఎంజాయ్ చేయవచ్చు. ఇది అక్రమం అని చాలామంది అనుకోవచ్చు. ఇలాంటి వ్యవహారం జరపడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించవచ్చు. సిగ్గు ఎగ్గు ఉంటే ఇదంతా ఎందుకు. అది లేదు కాబట్టే చాలామంది ఓయోకు వెళ్తున్నారు. అదేదో సినిమాలో “ఓకే అని అంటిమా.. ఓయోకు రమ్మంటడు” ఓ పాటలో చరణం గా ఉంటుంది. దానిని ఆ రచయిత ఎలా రాశాడో తెలియదు గాని.. వాస్తవంగా పరిస్థితి మాత్రం అదే. యువత, మధ్య వయసు వారు.. ఇలా ఏజ్ తో సంబంధం లేదు. మొన్నటి వాలెంటెన్స్ డే నాడు.. అంతకుముందు న్యూ ఇయర్ నాడు దేశవ్యాప్తంగా ఓయో రూములు 80 శాతం ఆక్యుపెన్సిని నమోదు చేశాయంటే రితేష్ అగర్వాల్ ముందు చూపూ ఎలా ఉందో అర్థం కావడం లేదా..
మూసివేస్తే ఏం కావాలి
శుక్రవారం నాడు ట్విట్టర్ ఎక్స్ లో #boycotoyo అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. వేల కొద్దీ పోస్టులు దాని కింద ట్రెడ్ అయ్యాయి. అయితే దీని అందరికి కారణం ఓయో కంపెనీ ఇచ్చిన ఓ ప్రకటన. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో మహాకుంభమేళా జరుగుతున్నది. ఇందులో భాగంగా తన బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి ఓయో కంపెనీ ఒక ప్రకటన ఇచ్చింది. అందులో “భగవంతుడు విశ్వవ్యాప్తంగా పరివ్యాప్తమై ఉన్నాడు.. అలాగే ఓయో కూడా” అని పేర్కొంది.. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించింది. మరి కొంతమందిలో ఆగ్రహాన్ని తెప్పించింది. అసలు ఓయో ను దేవుడితో పోల్చడం ఏంటనే ప్రశ్న వారిలో ఉత్పన్నమైంది. ఇంకేముంది ఓయో యాజమాన్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. హిందూ సంఘాల ప్రతినిధులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఓయో ను దేశంలో నిషేధించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ” అసలు దేవుడికి ఓయోకు ఏమైనా సంబంధం ఉందా.. ఓయోలో ఎటువంటి కార్యకలాపాలు జరుగుతాయో అందరికీ తెలుసు. అలాంటి కంపెనీ దేవుడితో పోల్చుతూ ప్రకటన ఇవ్వడం దేనికి? ఇలాంటి వాటి వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయని” హిందూ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. సోషల్ మీడియాలో ఓయో కంపెనీ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి దీనిపై ఓయో కంపెనీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. హిందూ సంఘాల ఆగ్రహం మరింత పెరగకముందే ఓయో కంపెనీ స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.